టీడీపీ, వైసీపీ ల సహకారం తో జనసేన కు 75 సీట్లు రావచ్చని అంచనా

తెలుగుదేశం పార్టీ ఆంతరంగిక సమావేశాల్లో TDP సొంతంగా చేయించుకున్న సర్వే లపై హై లెవల్ కమిటీ మేధో మధనం జరిగిందట…
ఈ సర్వే ల్లో *TDP కి ముప్పై నుండి నలభై సీట్లకే* పరిమితమౌతుందన్న ఫలితాలతో TDP ముఖ్య నాయకుల్లో అంతర్మధనం మొదలైందట… 
పవన్ లాంటి మిత్రుడ్ని దూరం చేసుకోవడం పై అధిష్టానాన్ని మిగిలిన సభ్యులు తీవ్రంగానే తప్పు బట్టారంట…
ఈ విమర్శలకి బదులు చెబుతూ చంద్రబాబు నాయుడు గారు పవన్ తో పొత్తు కోసం ఎన్నో ప్రయత్నాలు చేసినట్టు అన్నీ బెడిసి కొట్టినట్లు తన నిస్సహాయ తను వెళ్ళగక్కారట కాకపొతే టీడీపీ తోనే కాదూ పవన్ జగన్ తో కూడా కలిసి వెళ్ళక పోవడం ఊరటని కలిగించే విషయం అని కూడా చెప్పారట…
ఇలాంటి పరిస్థితుల్లో మూడు పార్టీలూ ఒకరిపై ఒకరు ఒంటరి పోరాటం చేసుకుంటే జగన్ కి లాభం… టీడీపీ నష్టం అనీ… అదీ కాక జగన్ అధికారంలోకి వస్తే టీడీపీ శ్రేణులపై ప్రతీకార దాడులు మొదలౌతాయనీ… తాజా గా కెసిఆర్ తో పెట్టుకున్న వైరం తో ఇటు ఆంధ్రప్రదేశ్ లోనే కాక అటు తెలంగాణాలో కూడా మన వారికి ఇక్కట్లు తప్పని భయానక పరిస్థితులు రావొచ్చని 
కనుక పవన్ మనకు సహాయం చేయక పోయినా మనమే పవన్ గెలిచేట్లు చూసుకోవాలని ఎక్కడైతే వైసీపీ బలంగా వున్న నియోజకవర్గాల్లో టీడీపీ నుండి వీక్ క్యాండిడేట్లను నిలబెట్టి జనసేన పార్టీ క్యాండిడేట్స్ వైసీపీ పై గెలిచేట్టు చూసుకోవడం ద్వారా జగన్ గెలిచే సీట్లని 50 సీట్లకు పరిమితం చేయొచ్చనీ తద్వారా టీడీపీ కి 75 సీట్లు జనసేనకి 50 సీట్లు వచ్చేట్టు చేయగలిగితే ఎన్నికల తర్వాత పవన్ తో పొత్తు కుదిరినా కుదరక పోయినా జగన్ పార్టీ ని మాత్రం అధికారానికి దూరం చేయొచ్చనీ కర్ణాటక లో జరిగినట్టు ఇక్కడా తప్పేట్టు లేదని ఇటువంటి వాటిని *పవన్ గారు ఒప్పుకోడని కనుక తన (పవన్) ప్రమేయం లేకుండానే* ఇవ్వన్నీ జరిగేట్టు చూడాలని అన్నారట…
మరి జగన్ కూడా వైసీపీ బలహీనంగా వున్న స్థానాల్లో జనసేన పై వీక్ క్యాండిడేట్స్ ని పెట్టి జనసేన గెలుపునకు సహకరిస్తే పరిస్థితేమిటని ఒకరిద్దరు సందేహం వేళ్ళ బుచ్చగా జగన్ ది నిరంకుశ మనస్తత్వం అని కనుక అది జరగని పని అంటూనే కెసిఆర్ ఏమైనా ఇలాంటి సలహా ఇస్తే జగన్ కూడా ఈ ఫ్రెండ్లీ కంటేస్ట్ ని అమలు చేయొచ్చని అప్పుడు టీడీపీ కి నలభై సీట్లు జగన్ కి అరవై సీట్లు… జనసేనకి 75 సీట్లు రావచ్చని… అలాంటి స్థితిలో మనం ఏమీ చేయలేని పరిస్థితులు వస్తాయని అలాంటి పరిస్థితులు రాకుండా చూసుకోవాలని అన్నట్టు తెలుగుదేశం పార్టీ విశ్వసనీయ వర్గాలనుండి వచ్చిన సమాచారం.


Leave a Reply

Your email address will not be published.