శ్వాసపీల్చకుండా 7 నిమిషాలు నీటిలోనే….

సాధారణంగా సినిమాల్లో తాము పోషించే పాత్రలకు తగినట్టుగా తమను తాము మలుచుకుంటారు. ఇందులోభాగంగా కొందరు బరువు తగ్గితే.. మరికొందరు బరువు పెరుగుతారు. ఇంకొందరు.. కత్తిసాములు, ఫైట్లు, కొత్తకొత్త క్రీడలు తదితర అంశాలపై దృష్టిసారిస్తారు.

తాజాగా, హాలీవుడ్ సూపర్ హిట్ మూవీ ‘అవతార్’ సీక్వెల్‌గా వస్తున్న సినిమా కోసం సీనియర్ నటి కేట్ విన్‌స్లెట్ నీళ్లలో శ్వాస తీసుకోకుండా సాధ్యమైనంత ఎక్కువసేపు ఉండటం ప్రాక్టీస్ చేస్తుంది. ఈ విషయాన్ని ఆ సినిమా డైరెక్టర్ జేమ్స్ కామరాన్ వెల్లడించారు. అవతార్ సీక్వెల్ కోసం నీటి లోపల సీన్లు చేయడానికి కేట్ చాలా ఉత్సాహం చూపిస్తున్నదని జేమ్స్ వెల్లడించారు.

ట్రైనింగ్ సందర్భంగా ఏడు నిమిషాల పాటు నీటిలోనే శ్వాస తీసుకోకుండా ఆమె ఉన్నట్లు అతను తెలిపారు. నీటిలోపల సన్నివేశాల కోసం కేట్ తీవ్రంగా శ్రమిస్తున్నది. ఓ సీన్ షూట్ సందర్భంగా కాదుగానీ శిక్షణలో భాగంగా సుమారు ఏడున్నర నిమిషాల పాటు ఆమె శ్వాస తీసుకోకుండా నీటిలో ఉంది.

నీటి లోపల తరచూ రెండు నుంచి మూడు నిమిషాల వ్యవధి సీన్ల షూటింగ్‌లో పాల్గొంటూనే ఉంది అని జేమ్స్ కామరాన్ చెప్పాడు. క్యారెక్టర్‌కు తగినట్లుగా ఆమె తనను తాను మలచుకుంది. ఆమెతో కలిసి పనిచేయడం చాలా ఆనందాన్నిస్తుంది అని జేమ్స్ తెలిపారు. 2009లో వచ్చిన అవతార్ మూవీకి సీక్వెల్‌గా వస్తున్న అవతార్ 2 డిసెంబర్ 2020లో రిలీజ్ అయ్యే అవకాశం ఉంది.

Leave a Reply

Your email address will not be published.