డిసెంబ‌ర్‌లో బ్యాంకుల‌కు 8 రోజులు సెల‌వులు

నిరంత‌రం క‌ష్ట‌ప‌డేవారికి విశ్రాంతి లేకుండా ఎప్పుడూ ప‌ని చెయ్యాలంటే ఎవ‌రికైనా క‌ష్ట‌మే. ఉద్యోగాలు చేసే వారికి క‌నీసం ఒక్క‌రోజ‌యినా సెల‌వు ఉంటుంది. ఈ మ‌ధ్య ప‌ని ఒత్తిడి పెర‌గ‌డం వ‌ల్లో మ‌రే కార‌ణాలో కానీ కొన్ని కంపెనీలు ఉద్యోగుల‌కు వారానికి రెండు రోజులు సెల‌వుల‌ను ఇస్తున్నారు. ఇక గూగుల్ లాంటి సాఫ్ట్ వేర్ కంపెనీల గురించి ప్ర‌త్యేకంగా చప్ప‌క్క‌ర్లుదు. వాటికి ఏకంగా వారానికి మూడు రోజులు కూడా సెల‌వు ఉంటుంది. శుక్ర‌వారం వ‌చ్చిందంటే సాఫ్ట్‌వేర్ ఉద్యోగులంతా వీక్ ఎండ్ మూడ్ కి వెళ్ళిపోతారు. పార్టీలు ప‌బ్ లు అంటూ వాళ్ళ‌కి వ‌ర్క్ మూడ్ అనేది అస‌లు ఉండ‌నే ఉండ‌దు.

ఇక ఇదిలా ఉంటే ఏది ఏమైన‌ప్ప‌టికీ ఏ కంపెనీకైనా వారానికి ఒక‌రోజు సెల‌వు అనేది త‌ప్ప‌నిస‌రి. అందుకు బ్యాంకులు కూడా మిన‌హాయింపు ఏమీకాదు. అయితే బ్యాంక్ ఉద్యోగులకు సెలవు కారణంగా లక్షల మందిపై ప్రత్యక్షంగానే ప్రభావం పడుతుంది. అందుకే బ్యాంకులకు ఎప్పుడెప్పుడు సెలవులు ఉన్నాయో ముందుగానే చూసుకుంటుంటారు కొంద‌రు.

ప్ర‌స్తుతం రోజుల్లో డ‌బ్బులేనిదే ఏ ప‌ని జ‌ర‌గ‌దు. తెల్లారితే డ‌బ్బులు ఎవ‌రికైనా అవ‌స‌ర‌ముంటుంది. బిజినెస్ వ్య‌వ‌హారాలు ఉన్న‌వారికి మ‌రింత క‌ష్టం ఎప్పుడూ డిపాజిట్‌లో, డీడీలు అంటూ బ్యాంకు చుట్టూ తిర‌గాల్సిన ప‌ని ఉంటుంది. దాంతో వాళ్ళు బ్యాంక్ సెల‌వుల‌ను ముందుగానే గ్ర‌హించాల్సి వ‌స్తుంది. ఈ క్రమంలోనే ఈ నెల (డిసెంబర్)లో బ్యాంకులకు ఎప్పుడెప్పుడు సెలవులు ఉన్నాయో ముందుగానే తెలుసుకోవడం మంచిది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో డిసెంబర్ నెలలోని రెండు, నాలుగో శనివారాలైన 14, 28 తేదీల్లో బ్యాంకులు పనిచేయవు. ఇకపోతే డిసెంబర్ నెల‌లో వ‌చ్చే ఐదు ఆదివారాలు 1, 8, 15, 22, 29 తేదీల్లో ఎలాగూ బ్యాంకులకు సెలవు. ఈ సెల‌వ‌లు కాకుండా ఉద్యోగుల‌కు మ‌రో రెండు రోజులు సెల‌వ‌లు క్రిస్ట‌మ‌స్ సంద‌ర్భంగా డిసెంబ‌ర్‌25న సెల‌వు ఉంటుంది. ఇక‌పోతే బ్యాంకుల‌కు సెలవులు ఉన్న‌ప్ప‌టికీ ఆన్‌లైన్ బ్యాంకింగ్‌ల‌కు ఆటంక‌మేమి లేదు. ఆన్‌లైన్‌, డిజిట‌ల్ వంటివి య‌ధావిధిగానే కొన‌సాగుతాయి.

Leave a Reply

Your email address will not be published.