జ‌బ‌ర్ద‌స్త్ క‌మెడియ‌న్ 80శాతం కిడ్నీలు ఫెయిల్‌


జబర్దస్త్ షో ద్వారా చాలా మంది కమెడియన్లు చిత్ర పరిశ్రమకి పరిచయం అవుతున్నారు. తమదైన స్టైల్ లో ప్రేక్షకులను నవ్విస్తూ ఆకట్టుకుంటున్నారు. ఎంతో మంది హస్యనటులను తెలుగు పరిశ్రమకి అందజేస్తుంది జబర్దస్త్ పోగ్రాం.. ఈ షోకి మెగా బ్రదర్ నాగబాబు, రోజా జడ్జిగా వ్యవహరిస్తున్నారు ఇక షోలో తమకంటూ మంచి గుర్తింపు తెచ్చుకున్నారు సుడిగాలి సుదీర్ ,రామ్ ప్రసాద్ , గెటప్ శ్రీను. అలాగే వెంకీస్ మంకీస్ టీమ్స్‌. ఇందులోంచి వెంకీస్ మంకీస్ టీం నుంచి జ‌బ‌ర్ద‌స్త పంచ్‌లు వేస్తూ ఎప్ప‌టిక‌ప్పుడు ప్రేక్ష‌కుల‌ను అల‌రించే ప్ర‌సాద్ మంచి క‌మెడియ‌న్‌. గ‌త కొంత కాలం నుంచి ఈ షోలో క‌నిపించ‌డం లేదు. దానికి కార‌ణం లేక‌పోలేదు. వీరు ఎంతో ఆనందంగా జోకులు వేస్తూ మ‌న‌ల్ని అంద‌రినీ న‌వ్విస్తారు. వీరి వెనుక కూడా ఎన్నో బాధ‌లు క‌ష్టాలు క‌న్నీటి గాధ‌లు ఉంటాయి.

ఇప్పుడు ప్ర‌సాద్ విష‌యంలో కూడా అదే జ‌రిగింది. ప్ర‌సాద్ త‌న రెండు కిడ్నీల‌ను 80శాతం కోల్పోయాడ‌ని నాగ‌బాబు చెప్పారు. అప్పుడ‌ప్పుడు త‌న‌కు బిజి వ‌స్తుంద‌ని అది ఎందుకో తెలియ‌ద‌ని చెప్పిన‌ట్లు స‌మాచారం. అయితే ఒక‌సారి హాస్ప‌ట‌ల్‌కి వెళ్లి చెక్ చేయించుకుని రాగా అత‌ని రెండు కిడ్నీలు పాడ‌య్యాయ‌ని చెప్పారు. దానికి జ‌బ‌ర్ద‌స్త్ టీం అంద‌రూ క‌లిసి ఎవ‌రికి త‌గినంత‌లో వారు ఆర్ధికంగా స‌హాయం కూడా చేశార‌న్నారు. అయితే జ‌బ‌ర్ద‌స్త్‌లో ఎవ‌రికైనా స‌రే ఆరోగ్య స‌మ‌స్య‌లు కాని ఆర్ధిక స‌మ‌స్యలు కాని ఉంటే మిగ‌తావారు స‌హాయం చెయ్య‌వ‌ల‌సిందిగా రూల్స్ కూడా పెట్టిన‌ట్లు నాగ‌బాబు చెప్పారు. ఇక పై అత‌ను బ్ర‌తికేది కూడా క‌ష్ట‌మ‌ని ఆయ‌న‌తో చెప్పుకునే వాడ‌ని కూడా తెలిపారు.  అయితే అప్ప‌ట్లో కొన్ని అనివార్య కార‌ణాల వల్ల స‌ర్జ‌రీ జ‌ర‌గ‌లేద‌ని తెలిపారు. ప్ర‌స్తుతం డ‌యాలిసిస్ జ‌రుగుతుంద‌ని అయిన‌ప్ప‌టికీ ప్ర‌సాద్ ప‌రిస్థితి దారుణంగా ఉంద‌ని అన్నారు. స‌ర్జ‌రీ చేయించుకుని తిరిగి మామూలు మ‌నిషి అవుతార‌ని అయితే షో నిర్వాహ‌కులు మాత్రంఇప్ప‌టి వ‌ర‌కు ఏమీ స్పందించ‌లేద‌న్నారు.

Leave a Reply

Your email address will not be published.