84 వార్డులలో ఏకగ్రీవంగా ఎన్నికైన తెరాస అభ్యర్థులు

స్థానిక సంస్థల ఎన్నికలకు నామినేషన్ల ఉపసంహరణ ఘట్టం మంగళవారం ముగిసిన నేపథ్యంలో తెలంగాణ భవన్లో పార్టీ కార్యదర్శి గట్టు రామచంద్రరావు, ఎమ్మెల్సీ ఎం శ్రీనివాస్ రెడ్డి, పార్టీ విద్యార్థి విభాగం నాయకుడు గెల్లు శ్రీనివాస్ యాదవ్ మీడియాతో మాట్లాడారు.  నామినేషన్ల ఘట్టం ముగిసే టప్పటికి 35 మున్సిపాలిటీలలో టీఆర్ఎస్ అభ్యర్థులు 84 వార్డులలో ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు తెలిపారు, అలాగే ఒక డివిజన్ను మొత్తంగా టిఆర్ఎస్ పూర్తిగా గెలుచుకుంది మొత్తం గా రాష్ట్ర వ్యాప్తంగా ఏడు వందల వార్డుల్లో బిజెపి కి నాలుగు వందల  వార్డులో కాంగ్రెస్ కు అభ్యర్థులు లేరని వారు గుర్తు చేశారు మున్సిపల్ ఎన్నికల్లో చాలా చోట్ల కాంగ్రెస్ బీజేపీలు లోపాయికారిగా సహకరించుకున్నాయని  వారు విమర్శించారు ఈ రెండు పార్టీల మధ్య ముసుగు కుదిరిందని ఆరోపించారు కరీంనగర్ నిజామాబాద్ జిల్లాలో వీరి మధ్య పొత్తు బహిరంగ రహస్యమని విమర్శించారు జాతీయస్థాయిలో కాంగ్రెస్ బీజేపీలు ప్రత్యర్థి పార్టీలు గా ఉన్నా తెలంగాణలో మాత్రం మిత్ర పక్షాలు గా మారిపోయాయి అని దుయ్యబట్టారు.  వరంగల్ జిల్లా పరకాల ఆదిలాబాద్ జిల్లా చెన్నూరు మున్సిపాలిటీలు టిఆర్ఎస్ ఖాతాలో పడ్డాయని చెప్పారు  అభ్యర్థులు లేని  బిజెపి,కాంగ్రెస్ రాష్ట్రంలో కనీసం టిఆర్ఎస్ కు పోటీ ఇవ్వలేని స్థితికి చేరుకున్నాయి అని విమర్శించారు మున్సిపల్ ఎన్నికల్లో అన్నింటిని టిఆర్ఎస్ గెలుచుకోవడం ఖాయమని వారు జోస్యం చెప్పారు.
రాష్ట్రంలో 120 మున్సిపాలిటీలు, తొమ్మిది మున్సిపల్ కార్పొరేషన్లకు సంబంధించి ఎన్నికల ‘బరి’ లో మిగిలింది దాదాపు 18 వేల మందిగా తేలింది. రాష్ట్ర ఎన్నికల కమిషన్ అధికారికంగా మంగళవారం రాత్రి వరకు పూర్తి వివరాలను విడుదల చేయలేదు. రాజకీయ పరంగా మినహా అధికారికంగా ఎన్నికల కార్యక్రమం సజావుగా సాగుతోంది. ఎన్నికల నిర్వహణకు సంబంధించి రాష్ట్ర ఎన్నికల కమిషనర్ వి.నాగిరెడ్డి ఎప్పటికప్పుడు జిల్లా కలెక్టర్లతో సంప్రదిస్తూనే ఉన్నారు. 

Leave a Reply

Your email address will not be published.