వేటూరి సుందరరామూర్తి 84 వజన్మదిన సందర్భంగా స్వరరాగ గంగా ప్రవాహం

విజయనగరం శాసనభ్యుడు కోలగట్ల వీరభద్ర స్వామి జ్యోతి ప్రజ్వలనతో ఈ కార్యక్రమం ఆరంభం అవుతుందని తెలిపారు. ఈ సమావేశానికి ముఖ్య అతిధిగా రాష్ట్ర మంత్రి బొత్స సత్యనారాయణ హాజరు కానున్నారని చెప్పారు. అలాగే గౌరవ అతిధులుగా మాజీ పార్లమెంటు సభ్యురాలు బొత్స ఝాన్సీ, హైదరాబాద్కు చెందిన ప్రముఖ వ్యాపార వేత్త పట్టాభి రామారావులు హాజరు కానున్నారని తెలిపారు. ఈ సందర్భంగా శంబర జోగారావు సంగీత సారధ్యంలో కే రమేష్ పట్నాయక్, శ్రీనాయుడు నేతృత్వంలో వేటూరి చిత్ర గీతాల సంగీత విభావరి జరుగుతుందని, అలాగే నర్తశాల డాన్స్ అకాడమి విద్యార్ధులు నృత్య ప్రదర్శన చేస్తారని చెప్పారు.
ఇప్పటివరకు ఆత్రేయ- వేటూరి పురస్కారాలందుకున్నవారిలో సినీ ప్రముఖులు భమిడిపాటి రాధాకృష్ణ మూర్తి, సుసర్ల దక్షిణామూర్తి, ఎస్ జానకి, సిరివెన్నెల సీతారామ శాస్త్రి, వేటూరి సుందర రామమూర్తి, రాజన్-నాగేంద్ర, పుహళేంది, కీరవాణి, ఎస్.పి . బాలసుబ్రహ్మణ్యం, పి.బి. శ్రీనివాస్, వాణీ జయరాం. మంగళం పల్లి బాలమురళీ కృష్ణ, సాలూరి కోటి, మణిశర్మలు ఉన్నారని, 2020 సంవత్సరానికి సంబంధించి వేటూరి పురస్కారానికి ఉత్తరాంద్ర నుంచి సినీ గీతాలకు ప్రత్యేక పేరుగా నిలుస్తున్న భాస్కరభట్ల రవికుమర్ని ఎంపిక చేసినట్టు వివరించారు.
ఈ మీడియా సమావేశం ప్రోగ్రాం కో-ఆర్డినేటర్ బిహెచ్.సూర్యలక్ష్మి ,ట్రెజరర్ మురళీ కుమార్, రాధికా రాణి లు పాల్గొన్నారు.