ఒకటే లైఫ్’ ఫిబ్రవరి 8న విడుదల

ఆర్.బి.చౌదరి తనయుడు జితన్ రమేష్ హీరోగా నటించిన ‘ఒకటే లైఫ్’ కు యూ/ఏ సర్టిఫికెట్, ఫిబ్రవరి లో విడుదల

సూపర్ గుడ్ ఫిలింస్ అధినేత ఆర్.బి.చౌదరి తనయుడు జితన్ రమేష్ హీరోగా లార్డ్ వెంకటేశ్వర ఫిలింస్ పతాకంపై నారాయణ్ రామ్ నిర్మిస్తొన్న చిత్రం ‘ఒకటే లైఫ్’. హ్యాండిల్ విత్ కేర్ అనేది ఉప శీర్షిక. ఎం.వెంకట్ దర్శకుడు. శృతి యుగల్ హీరొయిన్‌గా నటిస్తొన్న ఈ చిత్రం సెన్సార్ కార్యక్రమాలు పూర్తిచేసుకుని యూ/ఏ సర్టిఫికెట్ సంబడించుకుంది. ఫిబ్రవరి లో విడుదల చేయటానికి సన్నాహాలు చేస్తున్నారు నిర్మాతలు. భారీ మెజారిటీ తో విజయం సాధించిన తెరాస నాయకుడు హరీష్ రావు గతం లో  ఈ చిత్రం ట్రైలర్ లను విడుదల చేసారు. ట్రైలర్ కి మంచి ఆదరణ లభించింది. ఆర్.బి.చౌదరి తనయుడు జితన్ రమేష్ హీరోగా వస్తుండటం తో ఈ చిత్రం పై అంచనాలు పెరిగాయి. ఈ సందర్భం గా దర్శకుడు వెంకట్ మాట్లాడుతూ.. ‘‘టెక్నాలజీ పేరుతో పరుగులెడుతోన్న నేటి తరం.. హ్యూమన్ రిలేషన్స్‌కు, ఎమోషన్స్‌కు ప్రాధాన్యత ఇవ్వాలన్న కాన్సెప్ట్‌తో యూత్ ఫుల్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిన చిత్రమిది. సూపర్ గుడ్ ఫిలింస్ అధినేత ఆర్.బి.చౌదరి గారబ్బాయి జితన్ రమేష్ హీరోగా నటిస్తున్నారు. అమ్రీష్ అందించిన పాటలకు ఆదరణ బాగుంది. ఆర్. ఆర్. కూడా సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలుస్తుంది. ఈ సినిమా ఫిబ్రవరిలో విడుదలకు సిద్ధం గా ఉంది. సెన్సార్ వాళ్ళు సినిమా చూసి చాలా మంచి సినిమా తీసావు అని  మమ్మల్ని మెచ్చుకున్నారు. అని వర్గాల ప్రేక్షకులను ఈ సినిమా అలరిస్తుంది ” అన్నారు.

నిర్మాత నారాయణ్ రామ్ మాట్లాడుతూ.. “సెన్సార్ కార్యక్రమాలు పూర్తిఅయ్యాయి. యూ/ఏ సర్టిఫికెట్ వచ్చింది. దర్శకుడు ఈ సినిమాను తెరకెక్కించిన విధానం హైలెట్‌గా నిలుస్తుంది. హరీష్ రావుగారు మా ట్రైలర్‌ను విడుదల చేయడం చాలా ఆనందంగా ఉంది. ట్రైలర్ లు పాటలు చాల బాగావచ్చాయి. ఆర్.బి.చౌదరి తనయుడు జితన్ రమేష్ హీరోగా రావటం తో ఈ సినిమా పై అంచనాలు పెరిగాయి. డిస్ట్రిబ్యూటర్ లు మంచి రేటుకు సినిమా ని అడుగుతున్నారు.  ‘ఒకటే లైఫ్’ సినిమా మంచి విజయం సాధిస్తుంది అని ఆశిస్తున్నాము  ” అన్నారు.

Leave a Reply

Your email address will not be published.