Untitled Post

ఒకప్పుడు తెలుగులో స్టార్ హీరోయిన్గా వెలుగొందిన త్రిష కెరీర్ కు ఎండ్ కార్డు పడిందని అందరూ అనుకుంటున్న తరుణంలో విజయ్ సేతుపతితో కలసి గతేడాది తమిళంలో చేసిన ’96’ చిత్రం సంచలన విజయం నటిగా పడుతున్న ఇబ్బందులను తొలగించేలా చేసింది. ఈ సినిమా ఇచ్చిన తిరుగులేని కమ్ బాక్ కోలీవుడ్లో అందర్నీ ఆశ్చర్యపరిచిందనే చెప్పాలి. దర్శకుడు సి. ప్రేమ్ కుమార్ నిర్దేశకత్వంలో వచ్చిన ఈ సినిమాలో త్రిష నటనకు ప్రశంసల వర్షం కురింపించారు జనం. ఓ సాదా సీదా చిత్రంలా అంచనాలు లేకుండా వచ్చి బాక్స్ ఆఫీస్ వద్ద కాసుల పంట పండించడంతో పాటు ఈ సినిమాలో నటనకి గాను త్రిష అత్యధిక అవార్డులను గెలుచుకున్నారు. ఏషియన్ ఫిలిం అవార్డ్స్ నుండి ఫిలింఫేర్ తో సహా ఇప్పటివరకు 96 సినిమాకు మొత్తం 11 అవార్డులు త్రిషను వరించడం చూస్తుంటే ఇది కెరీర్ లోనే అత్యుత్తమ విజయంగా ఆమె తన సోషల్ మీడియా లో ద్వారా ఆనందాన్ని వ్యక్తం చేస్తూ, అభిమానులతో పంచుకున్నారు. అవార్డులన్నిటితో కలిసి తీసుకున్న ఫోటోను పోస్ట్ చేస్తూ పట్టరాని సంతోషాన్ని వ్యక్తం చేసారు. ప్రస్తుతం ఈ ఫోటో 96 సినిమా ప్రియులను విపరీతంగా ఆకట్టుకుంటుందనటంలో సందేహం లేదు.