’96’ రీమేక్ జానులో సమంత అక్కినేని

తెలుగులో టాప్ హీరోయిన్లలో ఒకరుగా వెలుగొందుతున్న సమంత అక్కినేని తాజాగా తమిళ హిట్ సినిమా ’96’ రీమేక్ జానులో నటిస్తోంది. దిల్ రాజు నిర్మాణంలో వస్తున్న ఈ చిత్రంలో తమిళలో త్రిష, విజయ్ సేతుపతి పాత్రలని సమంత, శర్వానంద్ లు చేస్తున్నారు. 96ను డైరెక్ట్ చేసిన ప్రేమ్ కుమారే ఈ సినిమాను డైరెక్ట్ చేస్తుండగా తమిళ మాతృకకు సంగీతం అందించిన గోవింద్ వసంత ఈ సినిమాకు కూడా సంగీతాన్నిఅందిస్తుండటం విశేషం.
కాగా ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకుని ఫిబ్రవరి 14న విడుదలకానున్న ఈ చిత్రం నుంచి ‘ప్రాణం’ అనే పాటను విడుదల చేసేందుకు రంగం సిద్దం చేసినట్టు చిత్రబృందం మీడియాకు ఆహ్వానం పంపింది. తనదైన మార్కు చిత్రాలు చేసే శర్వానంద్‌కు జోడీగా సమంత నటిస్తుండటంతో ‘జాను’ కోసం అభిమానులంతా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.