జాతీయ వార్తలుముఖ్యాoశాలు

రాహుల్‌, ప్రియాంకతో సహా 64 మంది పార్టీ ఎంపిలను పోలీస్‌లు నిర్బంధం

 

జిఎస్‌టి పెంపునకు వ్యతిరేకంగా కాంగ్రెస్‌ పార్టీ శుక్రవారం దేశవ్యాపిత
ఆందోళనలకు దిగింది. దేశ రాజధానిలో ఈ నిరసనలను అడ్డుకునేందుకు పోలీసులు యత్నించడంతో
తోపులాట జరిగింది. కాంగ్రెస్‌ నాయకులు రాహుల్‌ గాంధీ, ప్రియాంకతో సహా వందలాది మందిని పోలీసులు
అదుపులోకి తీసుకుని, 6 గంటల తరువాత విడిచి పెట్టారు. . రాష్ట్రపతి భవన్‌ వైపు ప్రదర్శనగా వెళ్లడానికి
ప్రయత్నించగా పోలీసులు అడ్డుకోవడానికి యత్నించడంతో వాతావరణం ఉద్రిక్తంగా మారింది. . విజరు
చౌక్‌ వద్ద మార్చ్‌ను ఢిల్లీ పోలీసులు అడ్డుకున్నారు. రాహుల్‌ గాంధీ, కెసి వేణుగోపాల్‌, అధిర్‌ రంజన్‌ చౌదరీ
, గౌరవ్‌ గోగయితో సహా 64 మంది పార్టీ ఎంపిలను పోలీస్‌లు నిర్భంధించి బస్‌లో తీసుకునివెళ్లారు. విజరు
చౌక్‌ వద్ద మీడియాతో రాహుల్‌ మాట్లాడుతూ ‘ధరల పెరుగుదల అంశంపై ఇక్కడ ఆందోళన చేస్తున్నాం’
అని తెలిపారు. అలాగే ‘ప్రజాస్వామ్యం హత్యగావించబడుతోంది’ అని అన్నారు. కాగా, పార్లమెంట్‌ గేట్‌
నంబర్‌ 1 బయట మహిళా ఎంపిలతో కలిసి సోనియాగాంధీ ఆందోళన చేశారు. నిత్యావసరాలపై జిఎస్‌టిని
ఉపసంహరించుకోవాలని నినాదాలు చేశారు.ఇక, ఎఐసిసి ప్రధానాకార్యాలయం బయట ప్రియాంక వదేరా
కాంగ్రెస్‌ కార్యకర్తలతో కలిసి ఆందోళనకు దిగారు. అయితే ముందుగానే కాంగ్రెస్‌ ఆందోళనల నేపథ్యంలో
ఎఐసిసి ప్రధానాకార్యాలయం సహా పలు ప్రాంతాల్లో భారీగా పోలీసులు మోహరించారు. పార్టీ కార్యాయలం
పరిసరాల్లో 144 సెక్షన్‌ విధించారు. కాంగ్రెస్‌ కార్యకర్తలను ర్యాలీకి అనుమతించలేదు. దీంతో ప్రియాంక
కాంగ్రెస్‌ ప్రధాన కార్యాలయం వద్ద ఏర్పాటు చేసిన బారికేడ్లను ఎక్కి దూకి రోడ్డుపై కూర్చుని ధర్నా చేపట్టారు.
అయితే అక్కడ నిషేధం ఉన్నందున ధర్నా చేయొద్దని పోలీసులు హెచ్చరించారు. అయినా ప్రియాంక
ఆందోళనను విరమించకపోవడంతో మహిళా పోలీసులు ఆమెను బలవంతంగా లాక్కెళ్లి పోలీసు వ్యాన్‌ ఎక్కించారు.
ఇందుకు సంబంధించిన దఅశ్యాలను కాంగ్రెస్‌ నాయకులు ట్విటర్‌లో పోస్ట్‌ చేస్తూ కేంద్రంపై విమర్శలకు దిగారు.
శాంతియుతంగా ఆందోళన చేస్తోన్న ఒక మహిళా నేత పట్ల ఇలాగే ప్రవర్తిస్తారా? అంటూ ప్రశ్నించారు. ఆందోళనల
సమయంలో ప్రియాంక గాంధీ మాట్లాడుతూ ‘ధరల పెరుగుదలను మంత్రులు చూడలేకపోతున్నారు. అందుకే మేం
ప్రధాని ఇంటి వరకూ వెళ్లి చూపించాలనుకుంటున్నాం. గ్యాస్‌ ధర ఎంత పెరిగిందో చెప్పాలను కున్నాం. అయితే
వారు మాపై దౌర్జన్యం చేయాలని చూస్తున్నారు’ అని చెప్పారు. ‘దేశంలో ద్రవ్యోల్బణం లేదని ప్రధానమంత్రి
అంటున్నారు. దేశ సంపదను కొద్ది మందికే దోచి పెడుతున్నారు. సామాన్య ప్రజలు కష్టపడుతున్నారు’
అని ప్రియాంక విమర్శించారు.

Leave a Reply

Your email address will not be published.

Back to top button

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker