తెలంగాణ
మణికొండలో హుక్కా సెంటర్ల పై పోలీసుల దాడి
నగరంలోని హుక్కా సెంటర్లపై రాయదుర్గం పోలీసుల దాడులు నిర్వహించారు.
రాయదుర్గం పీఎస్ పరిధి మణికొండలో హుక్కా సెంటర్లను అక్రమంగా
నిర్వహిస్తున్నారు. పక్కా సమాచారంతో హుక్కా సెంటర్లపై రాయదుర్గం పోలీసుల
దాడులు నిర్వహించారు. 9 మంది యువకులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
యువకుల నుంచి నగదు, 6 హుక్కా పోర్ట్స్, హుక్కాలో వాడే సామగ్రి స్వాధీనం చేసుకున్నారు.
కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారు.