ఆంధ్రప్రదేశ్

2024లో చంద్రబాబు సీఎం……. కరాచి కృష్ణ సైకిల్ యాత్ర

జూన్ 29న మంగళగిరి పార్టీ కార్యాలయం నుంచి కరాచి కృష్ణ సైకిల్ యాత్ర చేపట్టాడు తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు
నారా చంద్రబాబు నాయుడుమళ్లీ ముఖ్యమంత్రి కావాలంటూ అతడు
సైకిల్ యాత్ర చేపట్టాడు. ప్రజా చైతన్య సైకిల్ యాత్ర పేరుతో ఈ యాత్ర చేపట్టారు.
26 జిల్లాల్లో చేపట్టిన ఈ యాత్ర ఆదివారం రావుల పాలెం చేరుకుంది. ఈ సందర్భంగా కృష్ణకు రావులపాలెం మండలం,
టీడీపీ అధ్యక్షుడు గుత్తల రాంబాబు, అంబేద్కర్ కోనసీమ జిల్లా తెలుగు యువత అధ్యక్షుడు సతీష్ రాజు ఘనస్వాగతం
పలికారు. కరాచి కృష్ణ సైకిల్ యాత్ర విజయవంతం కావాలని, 2024లో చంద్రబాబు సీఎం కావాలని రావుల పాలెం టీడీపీ
నాయకులు ఆకాంక్షించారు. ఈ సందర్భంగా కృష్ణ మాట్లాడుతూ తాను చేస్తున్న సైకిల్ యాత్రకు ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా
ఎంతో ఆదరణ లభిస్తోందని, ఎంతో మంది మహిళలు, తనలో స్ఫూర్తి నింపుతున్నారని అన్నారు. చంద్రబాబు నాయుడు
ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసే వరకు తన సైకిల్ యాత్ర ఆగదని, అంతవరకు తన ఇంటికి కూడా వెళ్లనని స్పష్టం
చేశారు. జూన్ 29న మంగళగిరి పార్టీ కార్యాలయం నుంచి చంద్రబాబు చేతుల మీదుగా ఈ యాత్ర ప్రారంభమైనట్లు కృష్ణ తెలిపారు.

Leave a Reply

Your email address will not be published.

Back to top button

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker