ఆంధ్రప్రదేశ్ముఖ్యాoశాలు

వారానికి ఒక్కరోజైనా నేత వస్త్రాలు ధరించండి: పవన్‌

చంద్రబాబు, బాలినేని, లక్ష్మణ్‌కు చేనేత చాలెంజ్‌….తెలంగాణ మంత్రి కేటీఆర్‌ చాలెంజ్‌ స్వీకరణ

భారతీయ కళలు ఎంతో విశిష్ట స్థానాన్ని పొందాయని, అలాంటి వాటిల్లో వారసత్వంగా
విరాజిల్లుతున్నదీ.. సృజనాత్మకమైనదీ చేనేత కళా రంగమని జనసేన అధినేత పవన్‌
కల్యాణ్‌ అభిప్రాయపడ్డారు. నేడు జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా చేనేత
కళాకారులందరికీ శుభాకాంక్షలు తెలిపారు. దేశ స్వతంత్ర సంగ్రామంలో చేనేత కూడా
ఒక అహింసాయుత ఆయుధంగా ఉపయోగపడిందని గుర్తుచేశారు. దేశంలో ప్రతి
కుటుంబం వారంలో ఒకసారైనా చేనేత వస్త్రాలు ధరించాలన్న ధృడ సంకల్పాన్ని
బలంగా గుండెల్లో నింపుకోవాలని పవన్‌ సూచించారు. చేనేత వస్త్రాలు ధరించినప్పుడు
కలిగే నిడారంబరత, ప్రశాంతత, లాలిత్యం మనసును హత్తుకుంటుందని తెలిపారు.
అటువం గొప్ప సుగుణాలున్న చేనేతకు తన జీవితాంతం వారధిగా (బ్రాండ్‌ అంబాసిడర్‌)గా
నిలబడతానని పవన్‌ పునరుద్ధాటించారు.చేనేత కళాకారులు ఆర్థిక పుష్టితో ఆనందకరమైన
జీవితాన్ని గడపాలని మనసారా ఆకాంక్షించారు. చేనేత దినోత్సవం సందర్భంగా తెలంగాణ
రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కేటీఆర్‌ విసిరిన చేనేత చాలెంజ్‌ను జనసేన అధ్యక్షులు పవన్‌ కళ్యాణ్‌
స్వీకరించారు. చేనేత వస్త్రాలు ధరించిన ఫోటోలను సోషల్‌ మీడియాలో పోస్టు చేయడం ద్వారా
చేనేత వస్త్రాల వినియోగానికి మరింత ప్రోత్సాహం పెంచాలని ఆయన భావించారు. ఇందులో
భాగంగా పవన్‌ కళ్యాణ్‌ తాను చేనేత వస్త్రాలు ధరించిన ఫోటోలను ట్విట్టర్‌లో పోస్ట్‌ చేశారు.
అనంతరం టీడీపీ అధ్యక్షులు చంద్రబాబు,మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస రెడ్డి, బీజేపీ ఓబీసీ
మోర్చా జాతీయ అధ్యక్షులు, రాజ్యసభ సభ్యులు కె.లక్ష్మణ్‌ను చేనేత చాలెంజ్‌కు
నామినేట్‌ చేశారు.

Leave a Reply

Your email address will not be published.

Back to top button

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker