తెలంగాణముఖ్యాoశాలు

ఈ నెల 21న కాదు… ఈనెల 28న కానిస్టేబుల్ రాత పరీక్ష

సాంకేతిక కారణాల వల్ల ఈనెల 21న జరగాల్సిన కానిస్టేబుల్ ప్రిలిమినరీ రాత పరీక్షను నెల 28
నిర్వహిస్తున్నట్లు రాష్ట్ర పోలీస్ రిక్రూట్‌మెంట్ బోర్డు సోమవారం నాడు ఒక ప్రకటనలో తెలిపింది.
ఈక్రమంలో రాష్ట్రంలో మొత్తం 554 ఎస్‌ఐ, 15,644 కానిస్టేబుల్ పోస్టులకు ఏప్రిల్ 25న నోటిఫికేషన్
విడుదలైన సంగతి తెలిసిందే. మరో 614 ప్రొహిబిషన్, ఎక్సైజ్ కానిస్టేబుల్ పోస్టులకు ఏప్రిల్ 28న
నోటిఫికేషన్ జారీ అయింది. కానిస్టేబుల్ పోస్టులకు 6.50 లక్షల మంది దరఖాస్తులు చేసుకున్నట్లు
అధికారులు తెలిపారు. కానిస్టేబుల్ పరీక్షలకు హైదరాబాద్ సహా 40 పట్టణాల్లో పరీక్షా కేంద్రాలు
ఏర్పాటు చేసినట్లు నియామక బోర్డు అధికారులు గతంలోనే తెలిపారు. ఈ నేపథ్యంలో సాంకేతిక
కారణాల కారణంగా పోలీసు కానిస్టేబుల్ ప్రిలిమినరీ పరీక్ష వారం రోజుల పాటు వాయిదా పడ్డాయి.
ఈ నెల 21న నిర్వహించాల్సిన పరీక్షను ఈనెల 28న నిర్వహిస్తున్నట్లు పోలీసు రిక్రూట్‌మెంట్
బోర్డు ప్రకటించింది. ఈ నెల 18వ తేదీ నుంచి అభ్యర్థులు హాల్ టికెట్లు డౌన్ లోడ్ చేసుకోవచ్చని
ఈ సందర్భంగా బోర్డు సూచించింది.

Leave a Reply

Your email address will not be published.

Back to top button

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker