Allముఖ్యాoశాలు

సాహితీ ఇన్ఫ్రా పై కేసులు నమోదు చేసామన్న పోలీసులు..?

 

 సిసిఎస్, జూబ్లీహిల్స్, బాచుపల్లి పిఎస్ లలో కేసు నమోదు.
 సామాన్యులకైతే ఒక లెక్క.... బడా నేతలకైతే మరో లెక్క
 పోలీసుల తీరే అనుమానాస్పదం?
చిన్న చిన్న దొంగతనాలకు అలవాటుపడ్డ సామాన్యులకైతే పోలీసులు ఒకరకమైన ట్రీట్మెంట్ ఇస్తారు అదే నేతలైతే మరో రకమైన ట్రీట్మెంట్ ఇస్తారు మనిషిని బట్టి స్థితిని బట్టి ట్రీట్మెంట్ లో తేడా ఉంటుంది కేసులోనూ తేడా ఉంటుంది కేసులు పెట్టే సెక్షన్లోనూ తేడా ఉంటుంది. మనిషికి దేవుడు ప్రతి ఒక్కరికి నుదుటి రాత రాస్తాడు. తప్పు చేస్తే పోలీసు కూడా సామాన్యులకు ఒక లెక్క నాయకులకు మరో లెక్క లాగా రాతలు రాస్తా ఉంటారు విషయానికి వస్తే సాహితీ ఇన్ఫ్రా గ్రూపుకు సంబంధించి సాహితీ చైర్మన్ పై బాధితులు ఫిర్యాదులు ఇస్తే వాటిని పరిశీలిస్తామని పోలీసులు చెప్పారు ఆందోళన
చేస్తున్న పోలీసులు జూబ్లీహిల్స్ పోలీసులు ఆరవ తేదీ మీటింగ్ కు సాహితీ చైర్మన్ ఒప్పుకున్నాడని చెప్పారు అక్కడే ఉన్న బాధితులు గత రెండు సంవత్సరాల నుంచి ఆయన ఇదే మాటలు చెబుతున్నాడని వారు పోలీసులకు తెలిపారు. జూబ్లీహిల్స్ పోలీసులు మా సమక్షంలో సాహితీ చైర్మన్ ఇచ్చిన మాట ప్రకారం ఆరవ తేదీ మీటింగ్ జరుగుతుందని జరిపిస్తారని చెప్పారు అయితే ఆరవ తేదీ మీటింగ్ జరిగిందా జరగలేదు ఏదో ఒక వీడియోను ఎవరో ఒకరు చేత ఫార్వర్డ్ చేయించి సాహితీ చైర్మన్ చేతులుదులిపేసుకున్నాడు ఈ విషయాన్ని ముందే చెప్పిన బాధితులు పోలీసులు కూడా ఒక్కసారి మోసపోతే తెలుస్తుందని చెప్పుకొచ్చారు ఈ విధంగా మీడియాలో సాహితీ చైర్మన్ మరో గ్రూపు ఏర్పాటు చేసి వారి చేత మాకు సాహితీపై నమ్మకం ఉంది మేము చాలా నమ్మాము అని డబ్బులు ఇచ్చి కొంతమందిని ఏర్పాటు చేసి వారితో మీడియాలో ప్రచారo చేయిస్తున్నాడు అని బాధితులు వాపోతున్నారు. తప్పు చేసిన సాహితీ చైర్మన్ పట్టుకోకుండా 30వ తేదీ గొడవ జరిగినప్పటి నుంచి తొమ్మిదో తేదీ వరకు కూడా కేసు బుక్ చేయకుండా తప్పు చేసిన వాడు అని బయటికి తెలిసిన అతని గురించి పోలీసులు ఆరా తీయట్లేదు అదే అనుమానస్పదంగా కనిపించిన ఒక వ్యక్తిపై పోలీసులు లాఠీ ప్రయోగిస్తారు అదే సమయంలో స్టేషన్కు తీసుకెళ్లి సెల్లో వేస్తారు ఇదే నేరం అని ఏదో రాసి ఆ సామాన్యుడిని సెల్ లో పెట్టి తర్వాత వదిలేస్తారు నడిరోడ్డులో దాదాపు 1000 మంది మమ్మల్ని మోసం చేశాడు అని రిజిస్టర్ డాక్యుమెంట్లు పట్టుకొని జూబ్లీహిల్స్ నడిరోడ్డుపై ఏడుస్తూ నినాదాలు చేస్తుంటే ఏం జరిగింది అని విచారించే పోలీసు ఒక్కరుకూడా లేరు ప్రభుత్వం మీడియాలో వస్తున్న కథనాలను చూడరా ఎప్పుడు రాజకీయాలు మాట్లాడి ప్రజలను ఆకట్టుకోవాలని చూసే నాయకులు మరి ఇంత జరుగుతున్నా ఒక్క పార్టీ లీడర్ కూడా నోరు మెదపలేని పరిస్థితుల్లో ఉన్నారా ఇదేనా రాజకీయమంటే టిఆర్ఎస్ కాంగ్రెస్ బిజెపి సిపిఐ సిపిఎం టిడిపి ఎంఐఎం ఇంకో నాలుగు రకాల పార్టీలు ఇంతమంది ఓట్లు అడగటానికి అయితే ప్రజల దగ్గరికి వస్తారు రోడ్డుపై నుంచొని నినాదాలు చేస్తున్న వారిని ఏం జరిగింది? ఎందుకు జరిగింది వారు ఎవరు అని ఆరా తీసే సమయం కూడా నాయకుల్లో లేదా ఇదేనా ప్రజాస్వామ్యం.
జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్లో సాహితీ చైర్మన్ పై కోటి 50 లక్షలు ల్యాండ్ విషయంలో ఒక మహిళ కేసు నమోదు చేయించింది అలాగే హైదరాబాద్ సిసిఎస్ పోలీసులు సాహితీ చైర్మన్ పై కేసు నమోదు చేసినట్లు చెప్తున్నారు అలాగే బాచుపల్లి పోలీస్ స్టేషన్ లో సాహితీ చైర్మన్ పై మరో కేసు నమోదు అయిందని తెలియవస్తుంది దాదాపు పది రోజుల తర్వాత కేసులు
నమోదు కావడం ఆశ్చర్యం కలిగిస్తుంది.

Leave a Reply

Your email address will not be published.

Back to top button

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker