తెలంగాణముఖ్యాoశాలు

తెలంగాణ బీజేపీ కొత్త ఇన్‌చార్జ్‌గా ‘సునీల్ బన్సాల్‌‌’

రాష్ట్రంలో అధికారమే లక్ష్యంగా బీజేపీ నేతలు పావులు కదుపుతున్నారు. తెలంగాణ బీజేపీలో అధినాయకత్వం మార్పులు
చేపట్టింది. తెలంగాణ బీజేపీ కొత్త ఇన్‌చార్జ్‌గా సునీల్ బన్సాల్‌‌ను అధిష్టానం నియామించింది. సునీల్
బన్సాల్‌ తెలంగాణతో పాటు బెంగాల్‌, ఒడిశాకు ఇన్‌చార్జ్‌ వ్యవహరిస్తారు. మునుగోడు ఉప ఎన్నిక నేపథ్యంలో
రాష్ట్రంలో బీజేపీ ‘ఆపరేషన్‌ ఆకర్ష్‌’ జోరును పెంచింది. ఆ నియోజకవర్గంలో ఈ నెల 21న నిర్వహించ తలపెట్టిన
కేంద్రమంత్రి అమిత్‌ షా బహిరంగసభను ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న కమలం పార్టీ నేతలు ఈ సందర్భంగా
పెద్ద ఎత్తున చేరికలకు ప్రయత్నాలు చేస్తున్నారు. మునుగోడు ఉప ఎన్నిక అనివార్యమైన నేపథ్యంలో ప్రముఖుల
చేరిక ద్వారా మరింత జోష్‌ పెంచాలని భావిస్తున్నారు. ఇందులో భాగంగా టీఆర్‌ఎస్‌ కాంగ్రెస్‌లకు చెందిన పలువురు
సీనియర్‌ నేతలతోపాటు సినీ ప్రముఖులతో, రిటైర్డ్‌ ఐఏఎస్‌, ఐపీఎస్‌ అధికారులతోనూ బీజేపీ నేతలు సంప్రదింపులు
జరుపుతున్నట్లు తెలుస్తోంది.

Leave a Reply

Your email address will not be published.

Back to top button

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker