సాహితీ బాధితుల ఆశలపై నీళ్లు చల్లిన పోలీసులు

ఏపీ ముఖ్యమంత్రి నా అండ?
బుధాటి లక్ష్మీనారాయణపై పోలీసులు దయ చూపించారా
ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి నాకు అండగా ఉన్నాడని, నాకు టిటిడి లో పదవి ఇచ్చాడని, ఎంత మంది ఎన్ని రకాలుగా చెప్పుకున్నా జగన్మోహన్ రెడ్డి నాకు అండగా నిలుస్తారని బుధాటి లక్ష్మీనారాయణ బాధితులతో చెప్పుకొచ్చాడు.మోసం చేయడం పరిపాటి అయిపోయింది, అది కూడా చిన్నచితక మోసం కాదు దాదాపు 1500 కోట్లు ఇంత డబ్బు, ఒక వ్యక్తి ప్రజలను మోసం చేసి తీసుకొని సమాధానం చెప్పడం లేదు అంటే ఏంటి అర్థం, పోలీసులు మేమున్నాము విచారణ చేస్తున్నాము అంటూ బుధాటి లక్ష్మీనారాయణను ఎన్నో ప్రశ్నలు అడిగి చివరకు కేసును పక్కనపెట్టిసారు.
దొంగ అని ముద్ర పడిన తర్వాత అతన్ని శిక్షించడానికి ,ప్రత్యక్షంగా సాక్షాదారాలు ఉన్నప్పటికీ పోలీసులు మాకు కొన్ని నియమ నిబంధనలు ఉన్నాయి అంటూ సిసిఎస్ పోలీసులు పక్కకు తప్పుకున్నారా, లేదా బుధాటి లక్ష్మీనారాయణపై దయ చూపించారా. ఏదైతేనేం బాధితుల ఆశలపై నీళ్లు చల్లేశారు , లక్ష్మీనారాయణ స్వేచ్ఛగా తీరగమని చెప్పేశారు అనిపిస్తుంది. తెలుగు రాష్ట్రాలలో అత్యంత భయంకరమైన మోసంగా చెప్పుకునే సాహితీ ఇన్ఫ్రా మోసాన్ని పోలీసులు కూడా ఏం చేయలేక చేతులెత్తేసారా ,బాధితులు తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన ముఖ్యమంత్రులను కలిసి వారి గోడు వినిపించుకునేందుకు గతంలో ఎన్నో ప్రయత్నాలు చేశారు .కానీ వారి ప్రయత్నాలకు పోలీసులు ఒకవైపు బుధాటి లక్ష్మీనారాయణ మరోవైపు పు న్యాయం చేస్తామంటూ బుజ్జగించి తీరా వారి ఆవేశం చల్లారాక వారిని లెక్కచేయకుండా మాకేం పట్టింది అన్నట్టుగా వ్యవహరిస్తున్నారు. ఇకనుండి సాహితీ పై ఏకత్రాటిగా నిలబడి న్యాయం జరిగేంత వరకు పోరాడితే తప్ప ఎవరు దిగి వచ్చే పరిస్థితి లేదు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రధాన అనుచరులని బుధాటి లక్ష్మీనారాయణ బయట చెప్పుకుంటూ తనకు పదవి ఇచ్చింది తనను ఉద్ధరిస్తున్నది జగనేనని నా జోలికి వస్తే ఎంతకైనా తెగిస్తా అని మొదట్లో డబ్బులుఅడిగిన వారoదరిని ఇవ్వకుండా బాధితులను బెదిరించాడు, ఇటువంటి మనిషిని ముఖ్యమంత్రి హోదాలో జగన్ ఎలా బరాయిస్తున్నాడు, అని అందరూ చెప్పుకుంటున్నారు. బుధాటి లక్ష్మీనారాయణ చేతిలో మోసపోయిన వారందరికీ న్యాయం జరిగేలా చూడాలనేది ప్రజల ఆకాంక్ష