తెలంగాణముఖ్యాoశాలు

హఫీజ్ పేట, కూకట్పల్లి హౌసింగ్ బోర్డ్,గోకుల్ ప్లాట్స్ లో కొన్ని అక్రమ కట్టడాలకు ఫైర్‌ సేఫ్టీ ఎలా?

ఎత్తుతో సంబంధం లేకుండా......నె! ఫైర్‌ సేఫ్టీని క్షేత్రస్థాయిలో పరిశీలిం చే వారు ఎవరు?

   హైదరాబాద్ నగర పరిధిలో ఎన్నో అక్రమ కట్టడాలు వాటికి జిహెచ్ఎంసి పర్మిషన్ ఉండవు, మరికొన్నిటికీ రిజిస్ట్రేషన్ ఉండవు ఇలా వందల కొద్ది కట్టడాలు లక్షల కొద్ది జనాభా నివసిస్తున్నకొన్ని ప్రాంతాలు, వీటన్నిటిలో ఫైర్ సేఫ్టీ ఉండదు. ఒక్కదానికి మరొకటి ముడిపడి ఉండడంవల్ల ప్రతి ఒక్కదానికి పర్మిషన్లు అవసరం సేఫ్టీ అవసరం అలాగే జిహెచ్ఎంసికి ఆదాయము అవసరం, అలా కాకుండా కొంతమంది వ్యక్తులు తమ సొంత లాభాల కోసం డబ్బులు సంపాదించడమే పరమావధిగా పెట్టుకుని నిత్యం అక్రమాలకు పాల్పడుతూ డబ్బులు సంపాదిస్తూ ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుకుంటారు. జిహెచ్ఎంసి లో అడుగడుగునా అధికారుల పర్యవేక్షణ ఉంటుంది. ఈ పర్యవేక్షణ కేవలం డబ్బుల కోసంమాత్రమే హఫీజ్ పేట, కూకట్పల్లి హౌసింగ్ బోర్డ్, శేర్లింగంపల్లి నియోజకవర్గం చివరిలో ఒక వ్యక్తి దాదాపు పది అపార్ట్మెంట్లు కట్టాడు . ఈ అపార్ట్మెంట్లో రిజిస్ట్రేషన్ కావు కేవలం నోటరి రాసుకొని కొనుక్కోవాల్సిందే, అంటే ఈ బిల్డింగులకు పర్మిషన్లు ఉండవు, కానీ కరెంట్ మీటర్ వస్తుంది, వాటర్ పైపు వస్తుంది, ఫైర్ సేఫ్టీ ఉండదు .ఎందుకంటే ప్రభుత్వ అనుమతితో కట్టిన బిల్డింగులు కాదు కాబట్టి, మరి వీటిపై ఎవరు చర్య తీసుకుంటారు ఎవరు చర్య తీసుకోరు, ఆ బిల్డర్ ఇచ్చే డబ్బులు చేతిలో పెట్టుకొని వెళ్ళిపోతారు ,నిజానికి అక్రమ కట్టడాలలోనూ పరిమిషన్ తీసుకుని కట్టే బిల్డింగుల్లోను ఫైర్ సేఫ్టీ చాలా ముఖ్యం దీన్ని ఎంతమంది పాటిస్తున్నారు . ఎవరు పరిశీలించారు. జిహెచ్ఎంసి ఉద్యోగులు కేవలం జీతాల కోసం డ్యూటీలు చేయడం లేదా లంచాల కోసమే డ్యూటీలు చేస్తున్నారు అనేది స్పష్టంగా తెలుస్తుంది. ఎందుకంటే అనుమతులు లేని బిల్డింగులు కట్టకుండా ఆపడం వారివంతైనప్పటికీ చూసి చూడకుండా వదిలేయడం కూడా వారికి పరిపాటయిపోయింది దీనివల్ల ఫైర్ సేఫ్టీ జరిగినప్పుడు జరిగే ప్రాణ నష్టం ఎవరు తీరిగిస్తారు, అని ఎవరు అడుగుతారు, మేయరా, కమిషనర్ రా! ముఖ్యమంత్రి అడుగుతారా, అడిగితే ఇన్ని సమస్యలు రావు. ముఖ్యంగా ఫైర్ సేఫ్టీ గురించి దాని వివరాల గురించి తెలుసుకుంటే అగ్నిమాపక శాఖ నిబంధనల ప్రకారం ప్రస్తుతం 15 మీటర్ల కంటే ఎక్కువ ఎత్తున్న (ఐదంతస్తులు) వాణిజ్య నిర్మాణాలు, 18 మీటర్ల కంటే ఎక్కువ ఎత్తు (ఆరు అంతస్తులు) ఉన్న భవనాలకు మాత్రమే అగ్నిమాపక ఏర్పాట్లు అవసరం. కానీ, బోయిన్‌పల్లి, రాణిగంజ్‌, తాజాగా సికింద్రాబాద్‌లో అగ్ని ప్రమాదాలు జరిగిన భవనాలు 15 మీటర్లు, అంతకంటే తక్కువ ఎత్తు ఉన్నవే. అక్రమంగా సెల్లార్‌, సిల్ట్‌ ప్లస్‌ నాలుగంతస్తులుగా నిర్మించిన రూబీ లాడ్జ్‌ భవనమూ 15 మీటర్ల కంటే ఎక్కువ ఎత్తు లేదు. భవన యజమానులు వ్యూహాత్మకంగా ఈ తరహా భవనాలను నిర్మిస్తున్నారు. ఐదంతస్తుల కంటే ఎక్కువ ఎత్తు నిర్మిస్తే క్షేత్రస్థాయిలో పరిశీలించిన తర్వాతే ఎన్‌వోసీ ఇస్తారు. అప్పుడు సెట్‌ బ్యాక్‌లు లేకపోవడం; అక్రమంగా అదనపు అంతస్తులు నిర్మించిన విషయం బయటకు వస్తుందని ‘ముందు జాగ్రత్త’ తీసుకుంటున్నారు. స్థానిక పట్టణ ప్రణాళికా విభాగం అధికారులను మేనేజ్‌ చేసుకొని నిర్మాణ పనులు పూర్తి చేస్తున్నారు. తక్కువ విస్తీర్ణంలో ఉండే ఈ భవనాల్లోనే అగ్ని ప్రమాదాలు సంభవించి ఆస్తి, ప్రాణ నష్టం జరుగుతోంది. ఈ నేపథ్యంలోనే, నివాసేతర భవనాలన్నింటికీ అగ్నిమాపక ఏర్పాట్లు తప్పనిసరి చేస్తూ ఫైర్‌ లైసెన్స్‌ తీసుకునేలా చట్టాన్ని సవరించాలని త్వరలో ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపనున్నారు. ఇలా జరిగితే జిహెచ్ఎంసి కొచ్చే ఆదాయం పెరుగుతుంది ప్రజలు ప్రాణాలు పోగొట్టుకోకుండా సేఫ్టీ గా ఉంటారు లంచగొండి అధికారులు తగ్గుతారు రాజకీయ నాయకులు తగ్గుతాయి ఇల్లు కట్టుకునే వారికి ప్రశాంతత మిగులుతుంది అన్ని అంశాలను పరిగణలోకి తీసుకొని ప్రజలకు న్యాయం చేసే విధంగా పనిచేస్తే బావుంటుందని ప్రజల అభిప్రాయం

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker