తెలంగాణముఖ్యాoశాలు

భూ బకాసులను శిక్షించరా……270 కోట్లు విలువ కలిగిన భూమి మాయం

* పీటీల భూమి కాజేసేందుకు ఎత్తుకు పైఎత్తులు

*చక్రం తిప్పుతున్నా మాజీ మంత్రి…..

 పేదలు అంటేనే చులకన ఎందుకంటే వారికి ఎత్తుకు పైఎత్తులు వేయడం చేతకాదు, డబ్బులు ఖర్చు పెట్టి కోర్ట్ లు చుట్టూ తిరగడం తెలియదు .ఆర్డీవోలు, జాయింట్ కలెక్టర్లు, తాసిల్దారులు చుట్టూ తిరగడానికి పేదల దగ్గర డబ్బులు ఉండవు. భూ బకాసులకు మాత్రం కావలసినంత డబ్బు ఉంటుంది, దీనికి నిదర్శనం సంగారెడ్డి జిల్లాలో నందిగామ గ్రామపంచాయతీలో సర్వేనెంబర్ 168,169,170,171 లో మొత్తం భూమి 44 ఎకరాలుఉంది ఈ 44 ఎకరాలను 38E కింద పేదలకు ఇచ్చి గత 30 సంవత్సరాలు అయ్యింది. ఆ భూమిని సాగు చేసుకోమని చెప్పి ఆర్డిఓ ఆదేశాలు జారీ చేసి పీ టి సర్టిఫికెట్లు మంజూరు చేశారు. ఇటీవల కాలంలో ఆ భూమి మాది అంటూ ముస్లిములు కొందరు 2018లో సిటీ సివిల్ కోర్టులో దావా వేసి ఫైనల్ డిగ్రీ తెచ్చి జాయింట్ కలెక్టర్ కి ఆర్ డి ఓ కి ఇచ్చి ఇంప్లిమెంట్ చేసుకుని ఆ భూమిని పిటి లు లెక్క తెలియకుండా వారికి ఎటువంటి నోటీసులు ఇవ్వకుండా, వారి భూమిని అప్పనంగా 270 కోట్లకు అమ్ముకున్నారు. ఈ భూమి లో 18 ఎకరాలు ఎఫ్ టి ఎన్ లో ఉంది. ఆ ఎంటిఎల్ భూమిని గత 30 సంవత్సరాలుగా సెక్యూరిటీ సిబ్బందిని భూమిదగ్గర ఉంచి ఆ గుంటలను కాలువలను మట్టితో నింపేశారు, ఆపై వాటిపైన చెట్లు వేశారు, ప్రస్తుతం ఈ భూమిని పీటీలకు తెలియకుండా అమ్ముకొని 2022 ఏప్రిల్ నెలలో అమ్మకాలు కొనుగోలు జరిగాయి. ఈ అమ్మకాల్లో కొనుగోలు మొత్తం 270 కోట్లు చేతులు మారాయి. అప్పుడు 44 ఎకరాల భూమిని యాస్ ఫైర్ స్పేస్ ప్రైవేట్ లిమిటెడ్, తిత్తరంప రియాల్టర్స్, భవ్య ఎలైట్ హోమ్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్, చర్ల కోల స్వరణ్, వేములపల్లి సౌజన్య వారి పేర్ల మీద రిజిస్ట్రేషన్లు జరిగాయి ల్యాండ్ ఓనర్స్ నూర్ ఉన్నిసా బేగం పేరు మీద రిజిస్ట్రేషన్లు జరిగాయి .మొత్తం రిజిస్ట్రేషన్లు 27 డాకుమెంట్లు అయితే, ఆగస్టు నెలలో తిరిగి మరలా రిజిస్ట్రేషన్ జరిగాయి మొత్తం డాకుమెంట్లు 63 రిజిస్ట్రేషన్ లో జరిగాయి. ఈ రిజిస్ట్రేషన్లలో కొత్తగా బి సరోజమ్మ ,మనీ కుశాల్ ఎంటర్ప్రైజెస్, చిలకల వెంకటలక్ష్మి ,జాస్తి వెంకయ్య చౌదరి, గొట్టిముక్కల శ్రీనివాస్, పాలడుగు ఆశాలత, డాక్టర్ సుఖవాసి వారితో పాటు మొదటిసారి జరిగిన రిజిస్ట్రేషన్లలో మొత్తం కలిపి 63 రిజిస్ట్రేషన్లు జరిగాయి. వ్యవసాయం చేసుకుంటున్న వారికి ఎటువంటి సమాచారం ఇవ్వకుండా 30 సంవత్సరాలుగా ఆ స్థలంపై కాపలాకాస్తు ఉన్న పీటీలకు ఏమాత్రం చోటు పెట్టకుండా అడ్డదారిలో అప్పనంగా ఈ స్థలాన్ని కొట్టేశారు . ఈ విషయంపై కలెక్టర్కు ఎన్నోసార్లు మొరపెట్టుకున్నారు, కానీ కంపెనీలు పెట్టి వ్యాపారాలు చేసే వ్యాపారవేత్తలకు డబ్బులు ఉంటాయి కానీ సామాన్యులకు డబ్బులు ఎక్కడ ఉంటాయి 44 ఎకరాల భూమిని పీటీల దగ్గర్నుంచి లాక్కొని తీసుకుంటుంటే జిల్లా అధికార యంత్రాంగం ఏం చేస్తుంది. ఈ స్థలం అమ్మకం వెనుక ఒక మాజీ మంత్రి చక్రం తిప్పుతూ అనుకున్న పని అనుకున్నట్టుగా చేసుకుని ఎటువంటి సమాచారం తెలియకుండా ఎక్కడో వ్యాపారం చేసుకుంటున్న ఢిల్లీలో ఉన్న వారికి అమెరికాలో ఉన్నవారికి బెంగళూరులో ఉన్న వారికి ఆన్లైన్లో ల్యాండ్ చూపించి ఆ ల్యాండ్ పై ఉన్న అనేక రకాలైన విమర్శలను పట్టించుకోకుండా అమ్మకాల్లో కొనుగోలు చేస్తున్నారు 18 ఎకరాలఎఫ్ టి ఎన్ లో ఉంది అ భూమిని ఏ దురదృష్టవంతుడు కొనుగోలు చేస్తాడు వేచి చూడాల్సిందే.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker