తెలంగాణముఖ్యాoశాలు

అక్రమాలకు అంతేలేని జిహెచ్ఎంసి పనితీరు….వీరికి తోడు పోలీసులు మేయర్ గారి పరిపాలన ప్రజలకు పన్ను పోటు

 ఒక ఇంటిని కాజేయటానికి ఒక కుటుంబాన్ని రోడ్డుపాలు చేసిన ప్రభుత్వ ఉద్యోగులు ప్రజాప్రతినిధులు బండారాలు బట్టబయలవుతున్నాయి ఈ నేపద్యంలో హైదరాబాద్ నగర పరిధిలో ప్రజలకు ప్రజాప్రతినిధులు భారం కాకూడదు అలాగే ప్రభుత్వ ఉద్యోగులు, హైదరాబాద్ జిహెచ్ఎంసి పరిధిలో పనిచేసే సిబ్బంది, నగరంలో పనిచేస్తున్న పోలీసులు, ఎమ్మెల్సీ, ఎమ్మెల్యే, మంత్రులు ఏ ఒక్కరూ ప్రజలకు పన్నుపోటుగాను భారంగాను కాకూడదు. హైదరాబాద్ నగర పరిధిలో వీరందరూ చేస్తున్నది పచ్చి మోసం దగా బ్రతికుండగానే మనిషిని చంపుకు తినే నైజం ఇంత దురాగతాలకు పాల్పడి పదవుల్లో కొనసాగడం దురదృష్టం ఒక వ్యక్తి ఇల్లు వదిలి హాస్పిటల్ కు పోయి వచ్చేలోపు ఇల్లుని పోలీసుల సహాయంతో జిహెచ్ఎంసి సిబ్బంది సహాయంతో సబ్ రిజిస్టర్ దగ్గర రిజిస్ట్రేషన్ కూడా అయిపోయిన కథనాలు చాలా ఉన్నాయి వీటికన్నీటికి ఎమ్మెల్సీ ఎమ్మెల్యేలు మంత్రులు వీరి అండదండలతోనే జిహెచ్ఎంసి పరిధిలో అక్రమార్కులకు అండగా నిలిచి డబ్బు సంపాదనే ధ్యేయంగా పనిచేస్తున్నారు.దీనికి సంబంధించి ఒక సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. జిహెచ్ఎంసిలో కుతుబుల్లాపూర్ లోని రాజీవ్ గాంధీ నగర్ ఇంటి నెంబర్ 33 126/ ఏ ఈ స్థలము సర్వేనెంబర్ 79 90 గజాలు ఇది రాజీవ్ గాంధీ నగర్ పరిధిలోకి వస్తుంది మరియు దీని పరిధి గాజులరామారం కిందికి కూడా వస్తుంది, 2002 నుoడి కనకరాజు టాక్స్ చెల్లిస్తు…. 2020 వరకు ఆ ఇంటి పై పూర్తి రికార్డులు కనకరాజు పేరు మీదే ఉన్నాయి, అకస్మాత్తుగా ఆవుల సువర్ణ పేరు రావడంతో విషయం అంత బయటకు వచ్చింది. బల్లo కనకరాజు అనే వ్యక్తి అనారోగ్య కారణంగా ఆసుపత్రిలో చేరి తెరిగి ఇంటికి వచ్చేసరికి తన ఇంటిని దొంగ రిజిస్ట్రేషన్ చేయించుకున్న వారు ఒక్కసారిగా వచ్చి ముకుమ్మడిగా వారిని నిర్బంధించడంతో,బాదితులు పోలీస్ స్టేషన్కు వెళితే ఆక్కడ బాదితులను బయటకు రానివ్వకుండా ఎస్సై మన్మధరావు వారిని నిర్బంధించి, కనీసం ఫోన్ చేసుకోవటానికి కూడా వారికి అవకాశం ఇవ్వకుండా పోలీస్ స్టేషన్లో ఉంచేశారు. ఆ స్టేషన్కు అప్పుడు సీఐ బాలరాజు స్టేషన్ ఆఫీసర్ గా ఉన్నారు. వీరిద్దరి సమన్వయంతో కనకరాజు కుటుంబాబాన్ని రోడ్డున పడివేశారు, దీంతో కనకరాజు కుటుంబం కున్న మంచి పేరు రిటైర్డ్ ఉద్యోగులను కదిలించి. వారి ద్వారా లోకాయుక్తకు వెళ్లడంతో పోలీసులు చెర నుండి విముక్తి లభించింది. ప్రస్తుతం మన్మధరావు లోకాయుక్త లో ఉన్న తన కేసు పై తిరుగుతూ ఉండడం జరుగుతుంది. ఇల్లు పోయి ఆరోగ్యం పోయి ఇబ్బంది పడుతున్న కనకరాజు కుటుంబం పై పోలీసులు ఎవరు కేసు పెట్టారని ,వారు నిర్బంధించారు అసలు పోలీసులకు అంత ఇంట్రెస్ట్ ఎమీటి సివిల్ కేసు ల్లో వారు ఎందుకు కాలు మోపుతున్నారు. మన్మధరావుకు ఎందుకు వారిపైన అంత పగ కేవలం డబ్బుల కోసం ఒక ప్రజా ప్రతినిధి ఒక ఎమ్మెల్సీ డబ్బు ఆశ చూపి పోలీసుల్ని అధికారంతో ముందుకు నడిపి కనకరాజు కుటుంబాన్ని రోడ్డుమీద పడేయాలని చూసారు ,తరువాత లోకాయుక్త లో కేసు వేయడం ద్వారా వారు బయటపడ్డారు. ప్రస్తుతం సూరారం సబ్ రిజిస్టర్, జిహెచ్ఎంసి లో డిప్యూటీ కమిషనర్, GHMC ఇతర ఉద్యోగులు అందరూ రోడ్డున పడే సమయం ఆసన్నమైంది. ప్రాపర్టీ టాక్స్ నెంబర్లు మార్చి కొందరు అదే ప్రాపర్టీ టాక్స్ పై ఇంటి ఓనర్ పేరు లేకుండా మరొకరు పేరుతో బిల్లులు కట్టించి వాటి ద్వారా రిజిస్ట్రేషన్ చేసుకుంటున్నారు. కొంతమంది ఇన్ని రకాలుగా ప్రజలను తింటూ బ్రతుకుతున్నారు ,నెల నెల జీతాలు వచ్చి పోలీసులకు మామూలు వచ్చి, మరల ఈ దురాగతాలు చేస్తూ ఏం సాధించాలని పోలీసులు చేస్తున్న తప్పులు ఇతర పోలీసుల మీద పడే మచ్చలు, ఎప్పుడైనా ఆలోచించారా మంచివారికి చెడ్డవారికి ఒకటే దారి లాగా ఒక్క పోలీసు తప్పు చేసిన పోలీసు వ్యవస్థ మొత్తానికి ఈ అపవాదు అంటగడతారు. జిహెచ్ఎంసి మేయర్ తను పదవి చేపట్టినప్పటి నుండి తమ సిబ్బంది చేస్తున్న దురాగతాలపై ఎప్పుడైనా చర్యలు తీసుకున్నారా…..అసలు తీసుకుంటారా?…… తీసుకోరా!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker