తెలంగాణముఖ్యాoశాలు

కష్టమంటేనే ఇష్టం… సాటి మనిషిని గౌరవించే మనసు…. శరత్ ది

రైతుల కోసం పేదల కోసం ఎంతకైనా ముందుకెళ్లే మనిషి సిటీ క్రైమ్ ప్రతినిధి కలెక్టర్ శరత్ ఈ పేరు వినగానే చాలామంది పేదలు రైతులు వికలాంగులు వృద్ధులు అందరూ ఎంతో సంతోషిస్తారు ఎందుకంటే నష్టం జరిగింది మాకు సహాయం చేయండి అంటే అది ధనం తప్ప మరి ఏదైనా సహాయాన్ని ఎంతసేపైనా కష్టపడి ఎన్ని రోజులైనా ఎదురుచూసి పనిచేసి ఫలితాన్ని చూపించే వ్యక్తి కలెక్టర్ శరత్ నాయక్, ఈ పేరు తెలంగాణ రాష్ట్రం రాకముందు సంగారెడ్డి ఉమ్మడి జిల్లా లో ఎంతో ప్రతిష్టాత్మకంగా జాయింట్ కలెక్టర్ హోదాలో ఇన్చార్జి కలెక్టర్ హోదాలో ఎన్నో పథకాలను ప్రభుత్వం ప్రకటించే లోపే ఈ జిల్లాలో ఇటువంటి పథకం ఉంటే బాగుంటుంది జనాభాను బట్టి వారి స్థితిగతులను బట్టి ఆయన చెప్పేవారు మెదక్ ఉమ్మడి జిల్లా కేంద్రంగా సంగారెడ్డి లో ఉన్నప్పుడు రాయికోడు మండలం, మునిపల్లి మండలం, న్యాల్కల్ మండలం ,పుల్కల్ మండలం ,ఇంకా కొన్ని మండలాలు కొందరు పేదలు తాము కోర్టుకెళ్లి కేసులు ఎదుర్కొనలేక భూములు కోల్పోయే పరిస్థితి వచ్చినప్పుడు జాయింట్ కలెక్టర్ హోదాలో ఉన్న ఆయనకు వినతిపత్రం సమర్పిస్తే ఆ కేసును పరిశీలించి వారి చేతి నుండి ఒక్క రూపాయి కూడా ఖర్చుకానివ్వకుండా కలెక్టర్ ఆఫీస్ నుండి అన్ని పేపర్లను తయారు చేయించి తన కోర్టులోనే సమస్యను పరిష్కరించి భూములు అప్ప చెప్పి చేసిన ఘనత ఆయనకు దక్కుతుంది. సంక్షేమ హాస్టల్ లో అభివృద్ధి హాస్పిటల్స్ లో వైద్యం ఆయనకు ఎంతో ఇష్టమైనవి పచ్చదనం పరిశుభ్రత ముఖ్యంగా చూస్తారు మెదక్ జిల్లా నుండి బదిలీ అయ్యి వెళ్లిన తర్వాత సివిల్ సప్లై హైదరాబాదులోనూ ఆ తర్వాత జగిత్యాల జిల్లా కలెక్టర్ గాను ఆ తర్వాత కామారెడ్డి కలెక్టర్ గాను ఆ తర్వాత పంచాయతీ రాజ్ కమిషనర్ గాను ప్రస్తుతం సంగారెడ్డి జిల్లా కలెక్టర్ గాను ఆయన చేస్తున్న సేవలు మరువలేనివి కలెక్టర్ గా ఆయన అంబేద్కర్ కు సంబంధించిన ఒక పెద్ద కార్యక్రమంలో ప్రసంగించాల్సి వచ్చినప్పుడు, అనుకోని విధంగా మాట తరలి తర్వాత వెనక్కి తీసుకోలేము కాబట్టి దానిని తప్పు పట్టే వారందరికీ తప్పుగానే అనిపిస్తుంది. సహజసిద్ధమైన మాటలతో మనసులో ఎటువంటి కల్మషం లేకుండా స్వచ్ఛందంగా సేవ చేసే మనస్తత్వం కలిగిన అధికారులు చాలా అరుదుగా ఉంటారు. అందులో సంగారెడ్డి జిల్లాకు వచ్చిన వారిలో చాలామంది ఉన్నారు వారిలో ముఖ్యమైన వారు శరత్ నాయక్ మరియు హనుమంతరావు గతంలో వచ్చిన వారిలో రాహుల్ బొజ్జ ,మరియు పీయూష్ కుమార్ , బి వెంకటేశం గారు ఇటువంటి వారంతా చాలా అరుదుగా వచ్చి పోయారు, వీరిలోనే ఒకరు శరత్ నాయక్ ఆయన పనితీరులో ఎటువంటి అభ్యంతరాలు ఉండవు పని ఉంటుంది తప్ప భయం ఉండదు. ఎవరికో లాభం చేయాలని పనిచేసే మనస్తత్వం కాదు, అటువంటి వారిని సమాజ శ్రేయస్సు కోరే కొందరు వ్యక్తులు ఆయన పదాలను తప్పు పట్టవచ్చు కానీ మంచిని చేసే ప్రతి మనిషిలోను తప్పు చూపించకుంటు పోతే అటువంటి మనుషులు మరలా మనకి దొరకరు కావాలని చేసే కొందరు వ్యక్తులు మాట్లాడే మాటలను తప్పుపట్టాలి తప్ప పనిచేసి మనసు కలిగిన వారిని మనసున్న వారిని తప్పు పట్టడం చాలా నేరం, సంగారెడ్డి జిల్లా కలెక్టర్గా సిద్దిపేట జిల్లా కలెక్టర్గా గజ్వేల్ గడ అభివృద్ధి కరిగా పనిచేసిన హనుమంతరావు చేసిన అభివృద్ధిని ఎక్కడా తగ్గనివ్వకుండా ఆయన చేసిన సేవలు కంటే మరింత గొప్పగా చేయాలని దృఢ సంకల్పంతో జాయింట్ కలెక్టర్ గా పని చేసిన చోటికి, కలెక్టర్గా పంపాలని అనిపించి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం కలెక్టర్ శరత్ సంగారెడ్డి జిల్లా రావడం అంతే తప్ప ఎక్కడ ఉన్నా ఉద్యోగం చేసే వ్యక్తికి జీతం వస్తుంది కానీ జీతాల కోసం పనిచేసే వారికి జీతం కావాలి కానీ సేవ చేసే భాగ్యం ఉన్నంతకాలం ప్రజాసేవలో ఉండాలని తపన కొంతమందికే ఉంటుంది. జిల్లాలలో కలెక్టర్లుగా పని చేస్తే ప్రజలందరి మధ్యలో ఉండి వారి బాగోగులు చూడొచ్చని ఆలోచన ఉంటుంది అదే హైదరాబాదులో కమిషనర్ గాను సెక్రటరీ గాను ఉంటే నాలుగు రూముల నాలుగు గోడల మధ్య ఉండి పనిచేసుకొని సాయంత్రానికి ఇంటికి వెళ్ళిపోవచ్చు అలా కాకుండా మెదక్ జిల్లా ఉమ్మడి జిల్లా గా ఉన్నప్పుడు ఎంత పేదరికంగా ఉన్నదో ఎంత వెనుకబడి ఉన్నదో ఆ వెనుకబడిన తనాన్ని ముందుకు తీసుకురావాలని ఉద్దేశంతో కలెక్టర్ శరత్ సంగారెడ్డి జిల్లాకు రావటం జరిగింది. ప్రజల కోసం చిన్న చిన్న మాటలను పట్టించుకునే మనుషులు ఉంటే వారు ప్రజలకు చిన్నవారైపోతారేమో ఒక్కసారి అర్థం చేసుకోండి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker