శక్తివంతమైన అతి పెద్ద చైనా బాంబు
బీజింగ్, జనవరి 4: చైనా అత్యంత శక్తివంతమైన బాంబును ఆధునిక టెక్నాలజీ సహాయంతో రూపొందించింది. ఇంతకాలం అమెరికా తయారు చేసిన ప్రపంచంలోనే అతి పెద్ద బాంబు శక్తిని చైనా బాంబు అధిగమించిందని చైనా మీడియా పేర్కొంది. చైనా రక్షణ పరిశ్రమ నోరింకో ఈ ఏరియల్ బాంబును ప్రదర్శించింది. మొదటి న్యూక్లియార్‌యేతర బాంబు అని రక్షణ మంత్రిత్వశాఖ తెలిపింది. దీనిని మదర్ ఆఫ్ ఆల్ బాంబ్స్‌ని ఈ వివరాలను ప్రచురించిన గ్లోబల్ టైమ్స్ మీడియా తెలిపింది. న్యూక్లియార్ బాంబు తర్వాత అత్యంత శక్తివంతమైన బాంబని, దీనిని నిర్దిష్ట లక్ష్యంపైన జారవిడిస్తే భారీ ఎత్తున నష్టం సంభవిస్తుంది. ఈ బాంబును హెచ్-6కే బాంబర్ ద్వారా ప్రయోగాత్మకంగా జారవిడిచి చేసిన ప్రయోగం విజయవంతమైంది. చైనా నార్త్ ఇండస్ట్రీస్ గ్రూప్ కార్పోరేషన్ లిమిటెడ్ ఈ బాంబునుజారవిడిచిన దృశ్యాల క్లిప్పింగ్‌లను విడుదల చేశారు. మొదటిసారిగా ఈ బాంబు ప్రయోగం దృశ్యాలను విడుదల చేశారు. గత ఏడాది ఆఫ్గనిస్తాన్‌లో అమెరికా ఉగ్రవాదులపై జీబీయూ 43/బీ మాసివ్ ఆర్డనెన్స్ ఎయిర్ బ్లాస్టు బాంబును జారవిడిచింది. ఈ బాంబును ప్రయోగిస్తే భవనాలు పూర్తిగా ధ్వంసమయ్యాయి. కాగా అమెరికా బాంబు కంటే చైనా బాంబు తేలికైనదని, సులువుగా రవాణా చేయవచ్చని చైనా తెలిపింది. అమెరికా బాంబును తరలించేందుకు భారీ రవాణా వాహనం కావాల్సి ఉంటుందన్నారు.

Leave a Reply

Your email address will not be published.