తమన్నా తల్లి తండ్రులకు కరోనా !

 

నటి తమన్నా భాటియా తల్లిదండ్రులకు కరోనావైరస్ పాజిటివ్ అని తేలింది. అభిమానులు కన్ఫ్యూజన్ కి గురి కాకముందే తమన్నా తన ట్విట్టర్‌లో ఈ విషయాన్ని వెల్లడించింది. మిగిలిన కుటుంబ సభ్యులకు కూడా పరీక్షలు నిర్వహించగా వారికి నెగిటివ్ నెగటివ్ వచ్చినట్లు వివరణ ఇచ్చింది. సోషల్ మీడియాలో తమన్నా ఈ విధంగా పేర్కొన్నారు. ” నా తల్లిదండ్రులు వారాంతంలో తేలికపాటి కోవిడ్ 19 లక్షణాలతో కనిపించారు. దీంతో ముందు జాగ్రత్త చర్యగా, ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరూ వెంటనే పరీక్షలు చేయించుకున్నారు. ఫలితాలు ఇప్పుడే వచ్చాయి. దురదృష్టవశాత్తు, నా తల్లిదండ్రులకు పాజిటివ్ అని వచ్చింది. వెంటనే వైద్య అధికారులు వారి పరిస్థితిని అర్థం చేసుకొని చికిత్స అందిస్తున్నారు. మేము ముందు జాగ్రత్త చర్యలు పాటిస్తున్నాము. నాతో పాటు నా సిబ్బందితో సహా మిగిలిన కుటుంబ సభ్యులకు కూడా కారోన్ పరీక్షల్లో నెగిటివ్ అని తేలింది. దేవుని దయ వలన ఇపుడు ప్రతి ఒక్కరి పరిస్థితి బాగానే ఉంది. ఈ సమయంలో మీ ప్రార్థనలు మరియు ఆశీర్వాదాలు మాకు చా అవసరం అంటూ తమన్నా వివరణ ఇచ్చింది.

Leave a Reply

Your email address will not be published.