పాస్ లేకుంటే ఆంధ్రలోకి నో ఎంట్రీ

 గుంటూరు జిల్లా దాచేపల్లి మండలం పొందుగుల చెక్పోస్ట్ వద్ద పోలీసులు నిరంతరం కరోనా పై యుద్ధం చేస్తున్నారు.వివరాల్లోకి వెళితే ఆంధ్ర తెలంగాణ సరిహద్దు బోర్డర్ చెక్ పోస్ట్ వద్ద నిరంతరం పోలీసులు వెహికల్ పాస్ చెకింగ్ చేస్తూ తెలంగాణ నుంచి ఆంధ్ర ప్రదేశ్ వచ్చే వాహనాలను వెహికల్ పాస్ ఉంటేనే అనుమతిస్తున్నారు. లేకపోతే యు టర్న్ తీసుకొని తెలంగాణ వైపుకు తరలిస్తున్నారు.అయితే దాదాపు 4 నెలల నుంచి 24 గంటలు కరోన తో పోరాడుతూ పోలీసులు వాళ్ల ప్రాణాలకు తెగించి ఇక్కడ డ్యూటీ చేస్తున్నారు. పాస్ లేకుండా రాష్ట్రంలోకి అనుమతించడం లేదని , రికమండేషన్ కు తావులేకపోవటంతో కొంతమంది పోలీసులపై కావాలని దుష్ప్రచారం చేస్తున్నారు. ఆధారాలు లేకుండా దుష్ప్రచారం చేసే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు .పోలీస్లు చేస్తున్న ఈ సాహసానికి ప్రజలు ఎంతో అభినందనలు తెలుపుతున్నారు.

Leave a Reply

Your email address will not be published.