జపాన్‌ లో లింగమహోత్సవం

కొన్ని దేశాల్లో పాటించే ఆచారాల గురించి తెలిస్తే వామ్మో అని నోరు వెల్లబెట్టాల్సిందే. అమ్మో, ఇలాంటి మనుషులు కూడా ఉంటారా అని అనిపిస్తుంది మరి. కొన్ని ప్రదేశాలలో సాంప్రదాయాల గురించి తెలిస్తే ఒళ్లుగగురు పెడుతాది. మరీ ఇక్కడ కూడా అదే జరిగింది. ఇక వివరాల్లోకి వెళ్లితే.. విచిత్రమైన సాంప్రదాయాలలో ఇది ఒక దేశం. ఆ ఒక్కటే జపాన్‌ దేశం. జపాన్ ప్రజలు అత్యంత వైభవంగా, ఘనంగా జరుపుకునే ఉత్సవం ఒకటి ఉంది. దాని పేరు.. ఉత్సవం-కనమార మాట్సురి.. అని అంటారు. అదే దానిని తెలుగులో ప్రజలు లింగమహోత్సవం” గా చెప్పవచ్చు. ఆ రోజు అక్కడ ఏ వస్తువు చూసినా పురుషాంగం అంటే లింగాలనే గుర్తుకు తెస్తాయంటా. అయితే,.. వారు తినే ఆహారం నుంచి వారు పెట్టుకునే టోపీల వరకు ప్రతి ఒక్కటీ “పురుషాంగాల రూపం” లోనే కలిగి ఉంటుంది. 
అయితే,..ఏటా మార్చి నెల రాగానే జపాన్‌లోని ఈ పండుగకు ప్రజలు కిటకిటలాడుతుంటారు. ‘హొన్షు ఐల్యాండ్ ‘ ఈ పండుగకు సిద్ధమై పర్యాటకులతో అంగరంగవైభవంగా సాగుతుంది. అక్కడ “నొయగా నగరం”లోని ఐచీ ప్రాంతంలో కొయ్యతో తయారు చేసిన రెండు మీటర్ల పొడవైన పురుషాంగం ప్రతిమ- ఒక లింగ రూప మూర్తిని పూజించే పవిత్ర దేవాలయం వద్ద ఊరేగిస్తారు.
ఈ సందర్భంగా అంతా సాంప్రదాయ వస్త్రాలు ధరించి వేడుకలో పాల్గొంటారు. అయితే ఇక్క ఒక విచిత్రం ఉంది. అదేంటంటే.. సంతానం లేనివారు సంతానం కోసం పరితపించేవారు ఆ పురుషాంగాన్ని ప్రార్థిస్తూ ముద్దు పెట్టుకుంటారు. ఈ సాంప్రదాయాన్ని ప్రారంభించిన కొత్తలో పురుషాంగం ప్రతిమ చాలా చిన్నదిగా ఉండేది. అయితే, ఏడాదికాయేడు దాని ఆకారాన్ని పెద్దది చేస్తూ ఊరేగించడం ఇక్కడ తమ  సాంప్రదాయంగా మార్చారు. ఈ వేడుకలో భాగంగా అక్కడి ఆహార పదార్ధాలను, కూరగాయలను, అలంకారాలను, బొమ్మలను చాకోలేట్లను, కాండీలను సైతం పురుషాంగాల రూపంలోనే తయారు చేస్తారు. అరటి పండ్లను చాక్లెట్ రసంలో ముంచి విక్రయిస్తారు. ఈ పండుగ నిర్వహణ 1969లో ప్రారంభించారు. ఇప్పుడు ఇది ఒక మహోత్సవంగా మారింది.

Leave a Reply

Your email address will not be published.