టాప్ హీరోయిన్ల విద్యాఅర్హ‌తలు ఇవేనా…?

సినిమావాళ్ళంటేనే చాలామందికి చ‌దువుమీద ఇంట్ర‌స్ట్ లేనివాళ్ళే ఈ ఇండ‌స్ట్రీకి వ‌స్తార‌నే చిన్న అపోహ ఒక‌టి ఉంది. అయితే వీళ్ళ‌లో చాలా మంది మంచి చ‌దువులే చ‌దివి న‌ట‌న మీద ఉన్న ఆసక్తితో ఇండ‌స్ట్రీకి వ‌చ్చిన వాళ్ళు కూడా ఉంటారు. అందులోనూ ప్ర‌స్తుత త‌రం చ‌దువు త‌ర్వాతే ఏదైనా అనే కాన్పెప్ట్‌లో మంచిగా చ‌దువుకుని ఆ త‌ర్వాత వాళ్ళ యొక్క యాంబిష‌న్స్‌ని పూర్తి చేసుకుంటున్నారు. అందులో ఇప్పుడు  ఇండ‌స్ట్రీకి వ‌చ్చే క‌థానాయిక‌లు కూడా మంచిగా చ‌దువుకుని అప్పుడు ఇండ‌స్ట్రీకి వ‌స్తున్నారు.  వీళ్ళ‌లో కొంద‌రు సినిమాలకు చదువుకు పెద్దగా సంబంధం లేదు. చదువుతో సంబంధం లేకుండా అందం, అభినయంతో పాటు కాస్తంత అదృష్టం ఉంటే చాలు కథానాయికలుగా రాణించవచ్చని చాలా మంది ప్రూవ్ చేసిన వారు ఉన్నారు. అలా టాలీవుడ్‌లో అగ్ర పథనా  రాణిస్తున్న హీరోయిన్స్ ఎవరెవరు ఏమి చదువుకున్నారో తెలుసుకుందాం…

నయనతార తెలుగులో అగ్ర హీరోల స‌ర‌స‌న న‌టించి త‌న‌కంటూ ఓ ప్ర‌త్యేక స్థానాన్ని సంపాదించుకుంది. ఆ త‌ర్వాత తెలుగు తెరకు కాస్త గ్యాప్ ఇచ్చి త‌మిళ్‌కి వెళ్ళింది. ఇటీవ‌లె సైరా న‌ర్సింహారెడ్డి చిత్రంలో న‌టించి మంచి పేరును సంపాదించుకుంది. ఆమె విద్యాభ్యాసం ఎక్కువగా నార్త్‌లో జరిగింది. సినిమా కెరీర్ ప్రారంభించకముందు ఆమె మార్ధోమా కాలేజ్‌లో బీ.ఏ. పూర్తి చేసారు.


తెలుగు చిత్ర పరిశ్రమలో వరుస సినిమాలతో దూసుకుపోతున్న అందాల అనుష్క గ‌త కొంత కాలంగా అనుకోకుండా కాస్త గ్యాప్ వ‌చ్చింది. ఎంతో మంది అగ్ర‌క‌థానాయ‌కుల‌తో న‌టించ‌డ‌మే కాకుండా లేడీ ఓరియంటెడ్ చిత్రాల‌తో త‌న‌కంటూ ఓ ప్ర‌త్యేక‌ముద్ర‌ను వేసుకుంది ఈ భామ‌. విజ‌య‌శాంతి త‌ర్వాత ఆ త‌ర‌హా లేడీ ఓరియంటెడ్ చిత్రాలు చేయ‌డం ఈమెకే సాధ్య‌మైంద‌ని చెప్పాలి. తెలుగులో ‘సూపర్’ సినిమాతో ఎంట్రీ ఇచ్చిన అనుష్క శెట్టి కార్మెల్ కళాశాలలో కంప్యూటర్ అప్లికేషన్స్‌లో మాస్టర్ డిగ్రీ చేసింది.

ఒక సినిమాకు హీరో ఎంత ముఖ్యమో.. హీరోయిన్ అంత కంటే ఎక్కువ అనే చెప్పాలె. ఒక్కొసారి హీరోయిన్ కోసం ఒకటికి రెండు సార్లు సినిమాలు చూసే ప్రేక్షకులున్నారు. అలాంటి అందం అభిన‌యం ఉన్న క‌థానాయికే స‌మంత‌. నాగ‌చైత‌న్య‌ను పెళ్ళి చేసుకున్న త‌ర్వాత ఆమె కెరియ‌ర్ ఇంకా విజ‌య‌వంతం వైపు పరుగులు పెడుతుంద‌నే చెప్పాలి. చెన్నైలోని స్టెల్లా మేరీ కాలేజ్‌లో కామర్స్‌లో డిగ్రీ కోర్స్ పూర్తి చేసారు సమంత అక్కినేని.

Leave a Reply

Your email address will not be published.