కడప లో పదును పెంచి ప్రభుత్వం పై విరుచుకు పడ్డ పవన్

ప్రజలు ధైర్యంగా ఉండండి మనకు మంచి రోజులు వస్తాయని ప్రజలకు పవన్ కళ్యాణ్ పిలుపుని ఇచ్చారు . కడప జిల్లా జనసేనపార్టీ అద్వైర్యం లో నిర్వహించిన భహిరంగ సభలో పాల్గొన్న ఆ పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పై విరుచుకుపడ్డారు. కడప ప్రజలు ఉపాది కొరుతుంటే అణుశుద్ధి ఖర్మా గారాలను ఆహ్వానిస్తూ ప్రజల ప్రాణాలతో చలగాటం ఆడుచున్నారని మండిపడ్డారు.. ప్రభుత్వ భూములను అమ్మాలని జగన్ తీసుకున్న నిర్ణయాన్ని ఈ సందర్బంగా ప్రస్తావిస్తూ ప్రకృతిని కూడా అమ్మేయండి అంటూ ఆవేశంగా మాట్లాడారు.. టీడీపీ ప్రభుత్వం తప్పులు చేసిందన్న జగన్ రెడ్డి ఇపుడు ఏమిచేస్తున్నారు పసుపు రైతులకు ఎందుకు న్యాయం చేయటం లేదని ప్రశ్నించారు… ముఖ్యమంత్రి హోదాకు తగ్గట్టుగా జగన్ మోహన్ రెడ్డి హుందాగా ప్రవర్తించడం లేదు అందుకే జగన్ రెడ్డి అని సంబోధిస్తున్నాను అని తెలిపారు …