ఫీజు రీయింబర్స్‌మెంట్‌, స్కాలర్‌షిప్‌ బకాయిలను తక్షణమే విడుదల చేయాలి

గత కొద్దీ రోజుల నుండి ఫీజు రీయింబర్స్‌మెంట్‌, స్కాలర్‌షిప్‌ బకాయిలను తక్షణమే విడుదల చేయాలని డిమాండ్‌ చేస్తూ ఎస్‌ఎఫ్‌ఐ ఆధ్వర్యంలో పలు జిల్లాలో విద్యార్థులు ఆందోళనలు చేపట్టిన విషయం అందరికి విదితమే. ఈ క్రమంలో తాజాగా విజయవాడలో చేపట్టిన ‘చలో విజయవాడ’ ఉద్రిక్తతగా మారింది. శనివారం తుమ్మలపల్లి కళాక్షేత్రం నుండి ధర్నా చౌక వరకు ఎస్‌ఎఫ్‌ఐ ర్యాలీ కొనసాగింది. ఎస్‌ఎఫ్‌ఐ నేతలు మాట్లాడుతూ.. విద్యార్థులకు రావల్సిన ఫీజు రీయింబర్స్‌మెంట్‌, స్కాలర్‌షిప్‌లను విడుదల చేయాలంటూ.. విద్యార్థులంతా దేశవ్యాప్తంగా ఆందోళన చేస్తున్నప్పటికీ అధికారులు ఏమాత్రం స్పందించడం లేదని ఆగ్రహాన్ని వ్యక్తపరిచారు. ఈ క్రమంలో అక్కడి ప్రాతంలో తీవ్ర ఉదృక్తి నెలకొంది. ఈ క్రమంలో ఆందోళన చేస్తున్న విద్యార్థులను పోలీసులు అదుపుచేసేందుకు ప్రయత్నించగా  విద్యార్థులు ఆందోళనను మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. దాంతో ఆడపిల్లలని కూడా చూడకుండా పోలీసులు వారిని చితకబాదారు. రోడ్డు మీద ఆందోళన చేస్తున్న వారిని బలవంతంగా వాహనంలో ఎక్కించుకుని స్థానిక ప్రాంతంలోని 5వ టౌన్ పోలీస్ స్టేషన్‌కు తీసుకెళ్లారు.

Leave a Reply

Your email address will not be published.