ఉల్లి పై లొల్లి.. మాములుగా లేదుగా…?

ఉల్లి ధరలు నేడు దేశంలో సామాన్యులకు చుక్కలు చూపిస్తున్నాయి. ఉల్లిపాయ కోస్తుంటే రావలసిన కన్నీళ్లు వాటి ధర వింటేనే వస్తున్నాయి. అమాంతం ఆకాశానికి తాకిన ఉల్లి ధరల కారణంగా సామాన్యులు ఉల్లి కొనే పరిస్థితి లేకుండా పోయింది. ఉల్లి ధరలు ప్రస్తుతం 80-100 పలుకుతున్నాయి. ఇక నాణ్యమైన, మంచి సైజులో ఉండే ఉల్లిగడ్డ కావాలంటే కిలోకు రూ.150 దాకా ఖర్చు చేయాల్సిన పరిస్థితి నెలకొంది. ఈ క్రమంలో రోజు ఉల్లిని విక్రయించే హోటళ్లు, ఫాస్ట్ ఫుడ్ సెంటర్లు ఉల్లి లేకుండానే ఆహార పదార్థాలను వడ్డిస్తుండడం మనం చూస్తున్నాము. మార్కెట్లో ఉల్లిగడ్డను కొనేవాడిని శ్రీమంతుడిగా చూసే రోజులొచ్చాయి. ఈ ఉల్లిధరలపై ప్రముఖ వీడియో షేరింగ్ యాప్ టిక్ టాక్‌లో ఫన్నీ వీడియోలు ట్రెండ్ అవుతున్నాయి. ఏదైనా ఒక ట్రెండింగ్ న్యూస్ ఉందంటే చాలు దానిపైన ఈ మ‌ధ్య టిక్‌టాక్‌లు ఎక్కువ‌య్యాయి.

హైదరాబాద్ లో ఉల్లి ధరలు వినియోగదారులకు కన్నీళ్లు పెట్టిస్తున్నాయి. మార్కెట్లో గతంలో ఎన్నడూ లేని విధంగా  ఉల్లి ధరలు రికార్డు సృష్టిస్తున్నాయి.. బహిరంగ మార్కెట్ లో కేజీ రూ.120 నుంచి రూ.150 పలుకుతుంది. అకాల వర్షాలతో ఉల్లి పంట దెబ్బతినడంతో మహారాష్ట్ర , కర్నూల్ ,మహబూబ్ నగర్ నుంచి హైదరాబాద్ మలక్ పేట్ మార్కెట్ కు ఉల్లి ఆశించిన స్థాయిలో రాక పోవడంతో ధరలకు రెక్కలు వచ్చాయి. మాములుగా రోజు లక్ష బస్తాల ఉల్లి వస్తే…ప్రస్తుతం 5 వేల బస్తాలు కూడా రావడం లేదు. ఉల్లి పంట తగ్గడం , సరఫరా లేక పోవడంతో ధర విపరీతంగా పెరుగుతోంది.

మలక్ పేట్ హోల్ సేల్ మార్కెట్లో క్వింటల్ ఉల్లి రూ.15 వేలు పలికింది.30 ఏళ్ళ మలక్ పేట్ మార్కెట్ చరిత్ర లో రైతుకు కేజీకి రూ. 150 రూపాయలు దక్కడం ఇదే మొదటి సారి.దీంతో  రిటైల్ మార్కెట్ లో  రూ.120 నుంచి రూ. 150లకు చేరింది.

Leave a Reply

Your email address will not be published.