బ‌రువు పెర‌గ‌డ‌మే శాప‌మా!

 ప్ర‌స్తుతం త‌రంలో హీరోయిన్లకు బరువు పెర‌గ‌డం అనేది పెద్ద‌ సమస్యగా మారింది.  ఎన్నో వైవిధ్యభరితమైన సినిమాలు చేసి తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపుని సంపాదించుకున్న అనుష్క కూడా ఇటీవలి కాలంలో ఈ బరువు సమస్యతో సతమతమవుతోంది. ఒక్క సినిమా కోసం తను చేసిన ఆ సాహసమో… లేదంటే యోగా ట్యూటర్‌ కాబట్టి పెరిగినంత సులభంగా తగ్గిపోవచ్చుననే ఓవర్ కాన్ఫిడెన్సో కానీ మొత్తంమీద అధిక బరువు సమస్య ఇప్పుడు ఆవిడ కెరీర్‌ని డైలమాలో పడేసింది.

అయితే… బరువు తగ్గడానికి అనుష్క చేస్తున్న ప్రయత్నాలేవీ ఫలిస్తున్నట్లు లేవు. ఈ నేపథ్యంలో రెండు నెలల్లో బరువు తగ్గి స్లిమ్‌గా మారినట్లయితే తన సినిమాలో అవకాశం ఇస్తానని దర్శకుడు అనుష్కకు ఓ ప్రామిస్‌ చేసారట! ఈ ఆఫర్‌ కాస్తా ఊరిస్తున్నా, ఇన్నాళ్లుగా తగ్గని బరువు రెండు నెలల్లో ఎలా తగ్గాలో మరి… స్వీటీనే చూసుకోవలసింది అని టాలీవుడ్‌ జనాలు కొందరు గుసగుసలాడుకుంటున్నారు. మరికొందరైతే… పెళ్లి వయసు వచ్చి దాటుతూ వుంటే అలా లావుగా మారిపోతారని అంటున్నారు. ఏది నిజమో మరి.

Leave a Reply

Your email address will not be published.