పుట్టిన‌రోజు సందర్భం గా కొత్త సినిమా వివ‌రాల‌ను తెలిపిన శ‌ర్వానంద్భిన్నమైన‌ క‌థ‌ల‌తో సినిమాలు చేస్తూ చిత్ర‌సీమ‌లో త‌న‌దైన ముద్ర వేసిన శ‌ర్వానంద్ ఇప్పుడు   ఒక పూర్తి స్థాయి ఎంట‌ర్‌టైన‌ర్ చేసేందుకు అంగీక‌రించారు. శ‌ర్వానంద్ పుట్టిన‌రోజును పుర‌స్క‌రించుకొని శుక్ర‌వారం ఈ కొత్త సినిమా వివ‌రాల‌ను ప్ర‌క‌టించారు. కిశోర్ తిరుమ‌ల ద‌ర్శ‌క‌త్వంలో శ్రీ ల‌క్ష్మీ వెంక‌టేశ్వ‌ర సినిమాస్ బ్యాన‌ర్‌పై   సుధాక‌ర్ చెరుకూరి నిర్మించే చిత్రంలో న‌టించ‌నున్న‌ట్టు శ‌ర్వానంద్ తెలిపారు. గ‌తంలో సుధాక‌ర్ చెరుకూరి  ఇండ‌స్ట్రీలో అడుగు పెడుతూనే శ‌ర్వానంద్‌తో తొలిసారిగా ప‌డి ప‌డి లేచే మ‌న‌సు చిత్రాన్ని నిర్మించారు.రానా హీరోగా విరాట‌ప‌ర్వం చిత్రాన్ని ప్ర‌స్తుతం ఆయ‌న  నిర్మిస్తున్నారు. దీని త‌దుప‌రి శ‌ర్వానంద్‌తో త‌న మూడ‌వ‌ సినిమాని నిర్మించనున్నారు. కాగా ఈ సినిమా  ఎప్పుడు ప్రారంభిస్తారు?, తారాగ‌ణం, సాంకేతిక నిపుణుల వివ‌రాల‌ను త్వ‌ర‌లో ప్ర‌క‌టిస్తామ‌ని నిర్మాత సుధాక‌ర్ మీడియాకు చెప్పారు. 

 

Leave a Reply

Your email address will not be published.