పవన్ కళ్యాణ్ టైటిల్ `సత్యాగ్రహి` ఫస్ట్ లుక్ వచ్చింది

గతం లో పవన్ కళ్యాణ్ `సత్యా గ్రహి ` అనే టైటిల్ తో ఒక సినిమాను డైరెక్ట్ చేయాలనుకున్న సంగతి తెలిసిందే.  కొన్ని కారణాల వల్ల అది కార్యరూపం దాల్చ లేదు. అయితే ఆ టైటిల్ తో  … పవన్ కళ్యాణ్ సిద్ధాంతాల స్ఫూర్తి తో   `సత్యాగ్రహి` చిత్రాన్ని శ్రీ భవిత క్రియేషన్స్  పతాకం  పై గంగారెడ్డి నిర్మిస్తుండగా  కృష్ణ చైతన్య దర్శకత్వం వహిస్తున్నారు.    ఈ చిత్రం   ఫస్ట్ లుక్  నూతన సంవత్సరం సందర్భం గా ఈ రోజు రిలీజ్ చేశారు .   ఫస్ట్ లుక్ లో పవన్ కళ్యాణ్ పిడికిలి బిగించి  ఫోర్స్ తో ఉన్న ఫోటో వేశారు.  ఆ ఫోటో  ముందు ఆయన ఆదర్శంగా , ఆయన అడుగుజాడల్లో , పిడికిలి బిగించి ముందుకెళ్తోన్న నలుగురు యువకులు .. పోస్టర్ లో ఇంటెన్స్ కనిపిస్తోంది.

పవన్ కళ్యాణ్ ని స్పూర్తిగా  తీసుకొని తన సిద్ధాంతాలను ఆలోచనలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని, సమాజం పై యవత  బాధ్యత తో  ఉండాలని చెబుతూ … పవన్ కళ్యాణ్  ఫాన్స్ అయిన నలుగురు యువకులు సమాజాన్ని మార్చే బాధ్యత తీసుకుంటే ఎలా ఉంటుందనేది ఈ చిత్ర కథాంశంగా తెలుస్తోంది.   లవ్ స్టోరీస్, అడల్ట్ కంటెంట్ , లిప్ లాక్ లతో సినిమాలు వస్తున్న ఈ రోజుల్లో ఇలా సొసైటీ పైన సినిమా చేసినందుకు దర్శకుడి  ధైర్యాన్ని మెచ్చుకోవాలి.
 ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రానికి  మ్యూజిక్ : సాయి కార్తీక్ , పాటలు: శర్మ, సురేష్ గంగుల ,  ఎడిటింగ్: శ్రీకాంత్ , నిర్మాత :గంగా రెడ్డి , స్టోరీ -స్క్రీన్ ప్లే -డైలాగ్స్ -డైరెక్షన్ :కృష్ణ చైతన్య .


Leave a Reply

Your email address will not be published.