గోడ మీద వార్తలు

01 . ఇకపై తాగి డ్రైవింగ్ చేస్తూ పట్టుబడితే మొదటిసారే డ్రైవింగ్ లైసెన్సు రద్దు చేయాలని నిర్ణయించిన – హైదరాబాద్ పోలీసులు …

ప్లాస్టీకు మీద – లిక్కరు మీద మనోళ్ళకున్నంత చెత్త శుద్ధి ప్రపంచంలో మరెవడికీ ఉండదేమో – మూలాన్నొదిలేసి ఆకులు పట్టుకేళాడతారు…!!
02. ఆంధ్రప్రదేశ్ లో పంచాయితీ ఎన్నికలకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన – రాష్ట్ర ఎన్నికల సంఘం …
అమ్మ దానిమ్మ క్రీం బిస్కట్టో …అందుకా ..??  కరణాలూ మునసబులు సడెన్ గా  బయట కొచ్చారు ..?? 
03. రాజస్థాన్ లో ముస్లీం పోలీసులు గెడ్డాలు తీసేసి విధులకి హాజరు కావాలని ఆదేశించిన – పై అధికారులు …
దాని వలన ఒరిగేదేందిరా సామీ…?? ఆళ్ళకి నెల నెలా అదనంగా బ్లేడు ఖర్చులు తప్ప …?? 
04. ఇన్ కమ్ టాక్స్ రిటర్న్సప్పుడు తప్పుడు ఆధార్ నంబరిస్తే పదివేలు జరిమానా తప్పదని హెచ్చరించిన – అధికారులు …
అన్నిటికీ బయోమెట్రిక్ సిస్టం పెట్టి పారదొ…తే సఖం గోలొదిలిపోద్దిగా సామీ – కొంపదీసి టాక్సులు తగ్గాయని కొత్త స్కెచ్చేయ్యేట్లేదుగా …??
05. పదవ తరగతి పాస్ కాకపోయినా 18 రకాల డిగ్రీ కోర్సులు – ఓ ఆరు మాస్టర్ కోర్సులనీ చేసే అవకాశం కల్పించే ఆలోచనలో – ప్రభుత్వం …
సూత్తంటే – కొన్నేళ్ళకి పుట్టగానే పీహెచ్డీ సర్టిఫికేట్లిచ్చేట్టున్నారే .. ?? ఐనా సర్టిఫికేట్లకి తప్ప సరుక్కి విలువలేని కాలంలో ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయకూడదులే…!!
మరిన్ని వార్తల కోసం – నిత్యం చూస్తూనే ఉండండి – నా గోడ …!! 
“ తెలుగు వారందరం తెలుగు లోనే మాట్లాడుకుందాం ” 
:||: జై హింద్ :||:

Leave a Reply

Your email address will not be published.