డిశంబ‌ర్ సోమ‌వారాల‌లో ‘స‌రిలేరు నీకెవ్వ‌రు’ పాట‌లు జ‌నంలోకి

సెన్సేష‌న‌ల్ డైరెక్ట‌ర్ అనిల్ రావిపూడి  ద‌ర్శ‌క‌త్వంలో సూప‌ర్ స్టార్ మ‌హేష్ బాబు, లేడీ అమితాబ్ విజ‌య‌శాంతి ప్ర‌ధాన పాత్ర‌ల‌లో రూపొందుతున్న‌ లేటెస్ట్ మూవీ ‘స‌రిలేరు నీకెవ్వ‌రు’. ప్ర‌స్తుతం ఈ సినిమా శ‌ర‌వేగంగా షూటింగ్ జ‌రుపుకుంటోన్న ఈ సినిమా  ఒక సాంగ్  విదేశాల్లో చిత్రీక‌రించడం మిన‌హా అంతా పూర్త‌య్యింది. డిసెంబ‌ర్ 20కి షూటింగ్ మొత్తం కంప్లీట్ చేసి, త‌దుప‌రి కార్య‌క్ర‌మాలు పూర్తి చేయాల‌ని నిర్ణ‌యించారు. కాగా  ఇటీవ‌ల రిలీజ్ చేసిన టీజ‌ర్ కు ట్రెమండ‌స్ రెస్సాన్స్ రావ‌డంతో సినిమా స‌క్స‌స్ పై టీమ్ చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నట్టే క‌నిపిస్తోంది. డిసెంబ‌ర్ లో ఐదు సోమ‌వారాలు ఐదు పాట‌లు రిలీజ్ చేయాల‌ని నిర్మాత‌లు భావిస్తున్న‌ట్టు వినిపిస్తోంది. అలాగే   ట్రైల‌ర్ ను జ‌న‌వ‌రి 1న రిలీజ్ చేస్తుండా, ప్రీ రిలీజ్ ఈవెంట్ ను జ‌న‌వ‌రి 5న ప్లాన్ చేస్తున్నార‌ని తెలిసింది.


 ఇప్ప‌టి వ‌ర‌కు ప్ర‌మోష‌న్స్ లో వెన‌క‌బ‌డ్డాడు అనిపించినా డిసెంబ‌ర్ నుంచి ప‌క్కా ప్లాన్ తో ఈ చిత్ర ప్ర‌చారాన్ని తీసుకెళ్ల‌డానికి రెడీ అవుతున్నారంతా. మ‌హేష్ బాబు. అనిల్ సుంక‌ర‌, దిల్ రాజు సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాని సంక్రాంతి కానుక‌గా భారీ స్ధాయిలో రిలీజ్ చేయ‌నున్న విష‌యం విదిత‌మే.


అన్ని వ‌ర్గాల ప్రేక్ష‌కులను మెప్పించేలా, క‌మ‌ర్షియ‌ల్ హంగుల‌తో సినిమా రూపొందించామ‌ని, డిసెంబ‌ర్ నెల‌లో సినిమాను విడుద‌ల చేయ‌బోతున్న‌మ‌ని,  ద‌ర్శ‌క నిర్మాత‌లు తెలియ‌జేశారు.

Leave a Reply

Your email address will not be published.