మీరు నై అంటే…… మేము సై అంటాం….

మీరు నై అంటే…… మేము సై అంటాం….
విభ‌జ‌న‌ చ‌ట్టంలో ఇచ్చిన హ‌మీల కేంద్రం నెర‌వేర్చ‌క‌పోయినా రాష్త్ర ప్ర‌భుత్వం మాత్రం ఒక్కొక్క హ‌మీ అమ‌లుకు ఉన్న అన్ని అవ‌కాశాల‌ను ప‌రిశీలిస్తోంది. ఇప్ప‌టికే క‌డ‌ప‌లో ఉక్కు క‌ర్మాగారానికి శంఖుస్ధాప‌న చేసిన ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు విభ‌జ‌న చ‌ట్టంలో మ‌రో ప్ర‌ధాన హ‌మీ దుగిరాజ‌ప‌ట్నం పోర్టు విష‌యంలో కేంద్రం విముఖత వ్య‌క్తం చేయ‌డంతో రాష్ట్ర‌ప్ర‌భుత్వ‌మే వెనుకబ‌డిన ప్ర‌కాశం జిల్లాల్లో రామాయంప‌ట్నం పోర్టుకు శ్రీకారం చుడుతోంది. సుమారు 5వేల కోట్ల‌రూపాయ‌లు పెట్టుబ‌డితో ప్ర‌పంచంలోనే అతి పెద్ద బ్రెక్ వాట‌ర్ పోర్టుగా రామాయం పోర్టు నిల‌వ‌నుంద‌ని అధికారులు వెల్ల‌డిస్తున్నారు. బుధ‌వారం ముఖ్య‌మంత్రి చేతులు మీదుగా భూమి పూజ జ‌ర‌గనున్న ఈ పోర్టు ఈ శాన్య ఆసీయాదేశాలు, ఆగ్నేయ ఆసియా దేశాల వ‌ర్త‌కానికి స‌రికోత్త మ‌జిలీ కానుంది…
ప్ర‌కాశం జిల్లా లో రామాయప‌ట్నం పోర్టు శంఖుస్ధాప‌న‌తో ప‌రిస‌ర ప్రాంతాల అభివృద్దితో పాటు ప్ర‌జ‌ల‌కు పెద్ద ఎత్తున ఉపాది అవ‌కాశాలు ల‌భించ‌నున్నాయి. రామాయ‌ప‌ట్నం పోర్టు నిర్మాణం కోసం ఆంధ్ర‌ప్ర‌దేశ్ మారిటైన్ ఇన్ప్రాస్ట్ర‌క్చ‌ర్ డెవ‌లెప్ మెంట్ కార్పోరేష‌న్ లిమిటెడ్  ద్వారా నిధులు స‌మీక‌రించాల‌ని నిర్ణయించిన ప్ర‌భుత్వం దీనికోసం కాకినాడ రీజియ‌న్ పోర్టులు, మ‌చిలిప‌ట్నం రీజియ‌న్ పోర్టులు నుండ వ‌చ్చే ఆదాయాన్ని రామ‌యంప‌ట్నం పోర్టు నిర్మాణానికి  పదేళ్ళ‌పాటు ఉప‌యోగించాల‌ని నిర్ణ‌యించింది. రామాయంప‌ట్నం పోర్టు ప్ర‌పంచంలోనే అతి పెద్ద బ్రేక్ వాట‌ర్ పోర్టుగా పేర్కోంటున్న అధికారులు వివిధ ప‌రిశ్ర‌మ‌లు సైతం పోర్టుతో పాటు అక్క‌డ నెల‌కోల్పేంద‌కు ముందుకు వ‌చ్చాయంటున్నారు.. పోర్టును 2020 నాటికి టెండ‌ర్లు పిలిచి 2022 నాటికి వినియోగంలోకి తీసుకువ‌స్తామంటున్నారు. ఈ పోర్టు కోసం 3500 ఎక‌రాలు భూమిని 400 కోట్ల రూపాయ‌ల‌తో భూసేక‌ర‌ణ చేస్తామ‌న్న అధికారులు అటు మ‌చిలీ ప‌ట్నం పోర్టుకు ఈ నెలాఖ‌రుకు శంఖుస్ధాప‌న చేస్తామంటున్నారు. రామాయ‌ప‌ట్నం పోర్టులో బ్రెక్ వాటర్, నావిగేష‌న్ ఛాన‌ల్ నిర్మాణానికి 2500 కోట్లు రూపాయ‌లు ఖ‌ర్చు అవుతాయ‌ని అంచ‌నా వేస్త‌న్న  అధికారులు ఈపోర్టులో రెండు బెర్తులు ఏసియా పేప‌ర్ మిల్లుకు, రెండు బెర్తులు జిందాల్  సంస్ధ‌కు , ఒక బెర్తు రాంకో సంస్ధ‌కు క్యాపిట‌ల్ బెర్తులుగా కేటాయించ‌నున్నారు. మిగిలిన మూడు బెర్తుల‌ను క‌మ‌ర్ష‌య‌ల్ బెర్త‌లుగా అభివృద్ది చేయ‌నున్నామ‌ని వార ప్ర‌క‌టించారు. మొత్తం 13 మిలియ‌న్ ట‌న్నుల కెపాసిటీతో ఈ పోర్టును ప‌నిచేయించ‌డానికి ప్ర‌ణాళిక‌లలు  వారు సిధ్దం చేస్తున్నారు.
 చెన్నై, కృష్ణ ప‌ట్నంకు అతి స‌మీపంలో ఉన్నందున దుగ‌రాజ‌ప‌ట్నం పోర్టు ఆర్దికంగా అనువ‌యిన‌ది కాద‌ని కేంద్రం తేల్చ‌డంతో విభ‌జ‌న చ‌ట్టాన్ని కేంద్రం మ‌రోసారి నీరుగార్చింది. దీంతో ఇప్ప‌టికే క‌డ‌ప ఉక్కు క‌ర్మాగారానికి శంఖుస్ధాప‌న చేసిన ముఖ్య‌మంత్రి అటు వెనుక‌బ‌డిన ప్ర‌కాశం జిల్లాలో రామాయప‌ట్నంలో పోర్టు నిర్మాణానికి నిర్ణ‌యించారు. ఈ పోర్టు దోన‌కోండ ఇండ‌స్ట్రీయ‌ల్  క్ల‌స్ట‌ర్  తో పాటు నేష‌న‌ల్  ఇండ‌స్ట్రీయ‌ల్  ఇన్వెస్ట్ మెంట్ అండ్ మ్యానిఫెక్చ‌రింగ్ జోన్  ల‌కు అతి స‌మీపంలో ఉంటుంద‌ని చెపుతున్నారు. అటు పోర్టుకు అనుభందంగా ఆసియా పేప‌ర్ మిల్స్ 20 వేల‌మందికి  ఉద్యోగాలు క‌ల్పించ‌డంతో పాటు మెట్ట ప్రాంతాల్లో పండించే స‌రుగుడు ,జామాయిల్ రైతుల‌కు ఊర‌ట నిచ్చే మంచి ధ‌ర ల‌భిస్తుందంటున్నారు. పోర్టుకు అనుభందంగా స్టీల్ ప్లాంట్ తో పాటు, సిమెంటు ప‌రిశ్ర‌మ కూడా రానుంద‌ని చెపుతున్నారు. మొత్తం ఎనిమిది బెర్తుల‌తో నిర్మించే ఈపోర్టు సామ‌ర్ధ్యం చాలా ఎక్కువ‌గా ఉండ‌నుంద‌న్నారు. కేంద్రం ప‌రిధిలో ఉండే పోర్ట‌ల‌ను మేజ‌ర్ పోర్ట‌లు అని, రాష్ట్రం ప‌రిధిలో ఉండే పోర్ట‌ల‌ను మైన‌ర్ పోర్టులంటార‌ని అయితే  కృష్ణ‌ప‌ట్నం లాంటి మైనర్ పోర్టు కోల్ క‌త్తా, చెన్నై పోర్టుల‌ను మించి ప‌నితీరును క‌న‌బ‌రుస్తుంద‌న్న అధికారులు ఇదే అవ‌కాశం రామాయ‌ప‌ట్నంకు వ‌స్తుంద‌న్నారు. ఈ ప్ర‌జెక్టకు పెట్టిన ఖ‌ర్చ 12 సంవ‌త్స‌రాల్లోనే బ్రేక్ ఈవెన్ క రానుంద‌న్న అధికారులు సిఆర్ జెడ్ కు ఆర‌నెల‌ల్లో అనుమ‌తుల వ‌స్తాయ‌ని, ప‌ర్య‌వ‌ర‌ణ అనుమతుల‌కు సంవత్స‌రం పాటు స‌మ‌యం ప‌డుతుంద‌న్నారు.
కేంద్రం నేర‌వేర్చ‌ని అంశాల‌ను ఛాలెంజ్ గా తీస‌కుంటున్న రాష్ట్ర‌ప్ర‌భుత్వం ఒక్కోటి టేక‌ప్ చేసి  ముందుకు తీసుకు వెళ్ళ‌డం ప‌ట్ల‌ స్ధానిక ప్ర‌జ‌లు సంతోషం వ్య‌క్తం చేస్తున్నారు…

Leave a Reply

Your email address will not be published.