మైక్రోసాఫ్ట్ బాధ్యతల నుండి తప్పుకున్న బిల్ గేట్స్ప్ర‌పంచ కుబేరుల‌లో ఒక‌డిగా వెలుగొందుతున్న మైక్రోసాఫ్ట్ అధినేత బిల్ గేట్స్ త‌న మైక్రోసాఫ్ట్ బాధ్యతల నుండి తప్పుకున్నట్టు ప్ర‌క‌టించారు. ఇక‌పై త‌న  పూర్తి స‌మ‌యాన్ని దాతృత్వ కార్యకలాపాలపై దృష్టి సారించనున్న‌ట్టు ప్ర‌క‌టించారు. మైక్రోసాఫ్ట్ బాధ్యతల  వారెన్ బఫెట్‌కు చెందిన బెర్క్‌షైర్ హాత్‌వే బోర్డు మెంబర్‌గా కూడా తప్పుకుంటున్నట్టు ప్ర‌క‌టించారు. 

 65 వ‌య‌సు వ‌చ్చినందున బాధ్య‌త‌ల నుంచి త‌ప్పుకోవాల‌ని భావిస్తున్నాన‌ని, అయితే తనకు మైక్రోసాఫ్ట్ కంపెనీ కూడా ఎంతో ముఖ్యమని, దీని కోసం కూడా సమయం కేటాయిస్తానని బిల్ గేట్స్ చెప్పారు. తన జీవితాన్ని సమాజం కోసం ఉపయోగిస్తానని తెలిపారు. ప్ర‌పంచ వ్యాప్తంగా  ఆరోగ్యం, అభివృద్ధి, వాతావరణ మార్పులు పైనే తన దృష్టిని కేంద్రీకరించి, సేవ‌లందించాల‌ని నిర్ణ‌యించుకున్న‌ట్టు ఆయ‌న చెప్పారు.

తన ఆస్తిలో ఎక్కువగా దాతృత్వ సేవలకు వినియోగించే బిల్‌గేట్స్  త‌న‌ బిల్ అండ్ మెలిండా గేట్స్ ఫౌండేషన్ చారిటబుల్ ట్రస్ట్‌కు పూర్తి కాలం వినియోగించేందుకు మైక్రోసాఫ్ట్‌లో 2008 జూన్ 28న తన ప‌ద‌వి నుండి తప్పుకున్నారు. అంతకుముందు 2000 సంవత్సరం వరకు సీఈవోగా కొనసాగారు. 2014లో బిల్ గేట్స్ మైక్రోసాఫ్ట్ చైర్మన్ పదవికి రాజీనామా చేసిన విష‌య‌మూ విదిత‌మే. తాజాగా సంస్ధ నిర్వ‌హ‌ణ బాధ్య‌త‌ల నుంచి త‌ప్పుకుని అవ‌స‌ర‌మైన మేర‌కు త‌న సూచ‌న‌లు అందిస్తాన‌ని ఆయ‌న చెప్ప‌డం విశేషం.

 

Leave a Reply

Your email address will not be published.