ఈ భామ చీపురు పట్టుకుని ఫ్లోర్‌ ఊడుస్తుంటే….
రోహిత్ శెట్టి డైరెక్టర్‎గా నిర్మిస్తున్న కొత్త చిత్రం సూర్యవంశి. ఈ సినిమాలో బాలీవుడ్‌ స్టార్‌ యాక్టర్‌ అక్షయ్‌కుమార్‌ నటిస్తున్నారు. అక్షయ్ కుమార్ సరసన కత్రినాకైఫ్‌ హీరోయిన్‌గా నటిస్తోంది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్‌ శరవేగంగా జరుగుతోంది. అయితే సూర్యవంశి సెట్స్‌ను పరిశుభ్రంగా ఉంచేందుకు నడుం బిగించింది కత్రినాకైఫ్. సెట్స్ లో ఈ భామ చీపురు పట్టుకుని ఫ్లోర్‌ ఊడుస్తుంది. అయితే, సెట్స్ లో తను చేసిన పనికి కత్రినా జీ ఏం చేస్తున్నారంటూ అక్షయ్‌కుమార్‌ వీడియో తీశాడు. శుభ్రం చేస్తున్నానంటూ కత్రినా నవ్వుతూ.. అక్షయ్‌ను చీపురుతో కొడుతుంది. అక్షయ్‌ ఈ వీడియోను ఇన్‌స్టాగ్రామ్‌ లో షేర్‌ చేశాడు. సూర్యవంశి సెట్స్‌లో స్వచ్ఛ భారత్‌ కార్యక్రమానికి కొత్త అంబాసిడర్‌ దొరికారు అంటూ క్యాప్షన్‌ ఇచ్చాడు. ఈ వీడియోను చూసిన కత్రినా-అక్షయ్‌ అభిమానులు తెగ ఎంజాయ్‌ చేస్తున్నారు. 

 

Leave a Reply

Your email address will not be published.