“అన్న వదిలేసిండు” లిరికల్ వీడియో సాంగ్ ని రిలీజ్ చేసిన హీరో కార్తికేయ

రోహిత్,సుధా రావత్ హీరో హీరోయిన్లు గా ఎన్.ఎన్.ఎక్స్పీరియన్స్ ఫిలిమ్స్  బ్యానర్ లో జి.నరేష్ రెడ్డి నిర్మించిన చిత్రం  విట్టల్ వాడి.
ఈ మూవీలో “అన్న వదిలేసిండు” లిరికల్ వీడియో సాంగ్ లాంచ్ RX 100  ఫేం హీరో కార్తికేయ గారు గారి చేతుల మీదుగా జరిగింది.
ఈ సందర్బంగా హీరో కార్తికేయ మాట్లాడుతూ…
అన్న వదిలేసిండు సాంగ్ చాలా బావుంది.చిత్ర యూనిట్ కి బెస్ట్ విషెస్ చెప్తున్నాను.
తెలుగు రాపర్ రోల్ రైడా మాట్లాడుతూ…
విట్టల్ వాడి మూవీ లో అన్న వదిలేసిండు సాంగ్ లిరిక్స్ రాసి సాంగ్ పాడటమే కాకుండా యాక్ట్ చేయడం జరిగింది.మాస్ ఆడియన్స్ కి బాగా కనెక్ట్ అవుతుంది అని చెప్పారు.తనకి ఈ అవకాశం ఇచ్చిన డైరెక్టర్ కి ప్రొడ్యూసర్ కి థాంక్స్ చెప్పారు.
హీరో రోహిత్ మాట్లాడుతూ…
రోల్ రైడా అన్న కి స్పెషల్ థాంక్స్.రోల్ రైడా పాడిన ఈ సాంగ్ సూపర్ హిట్ అవుతుంది అని చెప్పారు.
ప్రొడ్యూసర్ జి.నరేష్ రెడ్డి మాట్లాడుతూ…
90 ml షూటింగ్ లో బిజీ గా ఉండి కూడా మా లిరికల్ వీడియో సాంగ్ రిలీజ్ చేయడానికి వచ్చిన హీరో కార్తికేయ గారికి చాలా థాంక్స్.ఈ సాంగ్ అందరికి నచ్చుతుందని సాంగ్ ని సూపర్ హిట్ చేయాలని అందరిని కోరుకుంటున్నా అని చెప్పారు.

Leave a Reply

Your email address will not be published.