వెండి తెర‌పై ‘కోడి కత్తి`


సస్పెన్స్‌ క్రైమ్‌ థ్రిల్లర్‌ ‘ఎం3’ (మ్యాన్‌ మ్యాడ్‌ మనీ అనేది క్యాప్షన్‌)  సినిమా ఫస్ట్‌లుక్‌ మోషన్‌ పోస్టర్ కి మంచి రెస్పాన్స్ వ‌స్తుండ‌గా ఈచిత్రానికి  ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన‌ రామ్ కృష్ణ తోట  చేప‌ట్టిన మరో సినిమా ‘కోడి కత్తి`. ఈ చిత్ర వివ‌రాలను ద‌ర్శ‌కుడు రామ్ కృష్ణ తోట మీడియాకు వెల్ల‌డించారు.
తెలుగు ప్రేక్షకులు కంటెంట్‌ బేస్డ్‌ మూవీస్‌, కొత్త తరహా సినిమాలను ఎప్పుడూ ఆదరిస్తారు. ఆ నమ్మకంతోనే ఓ కాన్సెప్ట్‌ బేస్డ్‌ సినిమాగా ‘ఎం3’ చిత్రం రూపొందించాన‌ని చెప్పారు.  నిజ జీవితంలో జరిగిన ఘటనల ఆధారంగా ‘కోడి కత్తి` స‌బ్జెక్ట్ రూపొందించాను ఇది ద‌ర్శ‌కుడిగా నా నెక్స్ట్ ప్రాజెక్ట్ అన్నారు.  ఈ చిత్రానికి ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ గా కె. శరత్ వర్మ పని చేస్తున్నారు. న‌టీనటులు, సాంకేతిక నిపుణుల వివరాలు త్వరలోనే తెలియజేస్తాన‌ని చెప్పారు.

Leave a Reply

Your email address will not be published.