జగన్ ఢిల్లీ పర్యటనల సీక్రెట్ ఏమిటి ?

సీఎం జగన్ తన ఢిల్లీ పర్యటన వివరాలను ఎందుకు గోప్యంగా ఉంచుతున్నారు? అని టీడీపీ నేత యనమల రామకృష్ణుడు ప్రశ్నించారు. మంగళగిరిలో ఆయన మీడియాతో మాట్లాడారు.. ఏడు సార్లు జగన్ ఢిల్లీకి వెళ్లి కేంద్ర పెద్దలను కలిశారన్నారు. కానీ ఇప్పటి వరకు ఆ భేటీ వివరాలు మాత్రం వెల్లడించలేదని ఆరోపించారు. వెల్లడించకపోతే ఏమనుకోవాలి? ఆయన కేసులకు సంబంధించి వెళ్తున్నారా?, రాష్ట్ర సమస్యలు కోసం వెళ్తున్నారా? అసలు ఏమనుకోవాలని యనమల నిలదీశారు.

ప్రధానితో ఎంత సేపు మాట్లాడారు? నిధులు ఏ మేరకు తెచ్చారు? అని అడిగారు.  బీజేపీ నేతలే పిలిచారా? లేక జగన్‌ నేరుగా వెళ్లారా? అని ప్రశ్నించారు. రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు పారిశ్రామిక వేత్తలు ముందుకు రావట్లేదని యనమల ఆరోపించారు. అప్రజాస్వామిక చర్యలతో ఆర్థిక వ్యవస్థను పూర్తిగా సంక్షోభంలోకి నెట్టారని ధ్వజమెత్తారు. జగన్ తీసుకుంటున్న నిర్ణయాలు సరికాదని అన్నారు. భవిష్యత్తు తరాలకి అన్యాయం జరిగే విధంగా జగన్ నిర్ణయాలుంటున్నాయని విమర్శించారు. కియా సంస్థ వారు కూడా ఇబ్బందులు పడుతున్నారని ఆరోపించారు.ల సీక్రెట్ ఏమిటి 

Leave a Reply

Your email address will not be published.