సంక్రాంతికి విడుదలై ఘన విజయం సాధించిన తమిళ సినిమా ‘పటాస్’

కథానాయకుడిగా ది విలక్షణ శైలిలో నటించిన తమిళ సినిమా ‘పటాస్’. తమిళంలో సంక్రాంతికి విడుదలై ఘన విజయం సాధించింది. ఆర్.ఎస్. దురై సెంథిల్ కుమార్ దర్శకత్వం వహించిన ఈ సినిమాని శ్రీమతి జగన్మోహిని సమర్పణలో విఘ్నేశ్వర ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై నిర్మాత సీహెచ్ సతీష్‌కుమార్ నేతృత్వంలో తెలుగులో లోకల్ బాయ్ గా విడుదల చేసేందుకు సిద్దం చేసారు.
‘కృష్ణగాడి వీరప్రేమగాథ‘, ‘మహానుభావుడు’, ‘రాజా ది గ్రేట్’, ‘ఎఫ్ 2’, ‘ఎంత మంచివాడవురా’ సినిమాల్లో తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకున్న మెహరీన్ ఈ సినిమాలో హీరోయిన్ కాగా . స్నేహ మరో హీరోయిన్ గా నటించింది. ‘అరవింద సమేత వీరరాఘవ’, ‘ఎవరు’ సినిమాల్లో నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్రల్లో అద్భుత నటన కనబరిచిన నవీన్ చంద్ర విలన్ పాత్ర పోషించారు.
ఈ సినిమాను తెలుగులో ఇటీవల విడుదల చేసిన ఫస్ట్ లుక్ కి మంచి స్పందన లభించిందని, తెలుగు ప్రేక్షకులలో ధనుష్‌కు ఉన్న ఆదరణతో సినిమా సక్సస్ అవుతుందని, ఫిబ్రవరిలో సినిమాను విడుదల చేయనున్నట్టు సతీష్ కుమార్ తెలిపారు…