నందినిరెడ్డికి మెగా ఛాన్స్‌లేటెస్ట్ గా మెగా కాంపౌండ్‌లోకి అడుగుపెడుతోంది నందినిరెడ్డి.  ల‌స్ట్ స్టోరీస్ వెబ్ సీరీస్‌లో ఒక పార్ట్ ను అమ‌లాపాల్‌, జ‌గ‌ప‌తి బాబు తో డైర‌క్ట్ చేసిన నందినీ తాజాగా మెగా కాంపౌండ్‌లో వైష్ణ‌వ్ తేజ్‌తో ఓ సినిమా చేసేందుకు  కొత్త క‌థ‌ను సిద్ధం చేసుకుంది నందిని. ఇప్ప‌టికే ఓ బేబి చిత్రం విజ‌యంతో ఫుల్ జోష్‌లో ఉన్న నందిని మెగాస్టార్ చిరంజీవికి ఈ క‌థ‌ను వినిపించింద‌న‌ట‌. చాలా బాగుంద‌ని భుజం త‌ట్ట‌డంతో తెగ ఆనందిస్తోంద‌ట‌.
ప్ర‌స్తుతం వైష్ణ‌వ్ ఉప్పెన పేరుతో మైత్రీ మూవీ మేక‌ర్స్ సినిమాతో బిజీగా ఉన్నాడు. ఈ సినిమా త‌ర్వాత స్వ‌ప్నసినిమాస్ నందిని -వైష్ణ‌వ్ మూవీని రూపొందించ‌నున్న‌ట్టు తెలుస్తోంది. ప్ర‌స్తుతం నందిని లొకేష‌న్ల వేట‌లో ఉన్నట్టు తెలుస్తోంది. అన్నీ క‌రెక్ట్ గా కుదిరితే సంక్రాంతి త‌ర్వాత ఈ మూవీ సెట్స్ మీద‌కు వెళ్లే ఆస్కారం ఉంద‌ని తెలుస్తోంది.

Leave a Reply

Your email address will not be published.