బోయపాటి శ్రీను దర్శకత్వంలో ముచ్చటగా మూడోసారి

బాలయ్య సినిమాలు ఈ మధ్య ఆశించిన ఫలితాలు ఇవ్వడం లేదు. దీంతో తనకు కలిసి వచ్చిన బోయపాటి శ్రీను దర్శకత్వంలో ముచ్చటగా మూడోసారి నటిస్తున్నారు. ఇప్ప‌టికే వీరిద్ద‌రి కాంబినేష‌న్‌లో వ‌చ్చిన సింహా, లెజెండ్ చిత్రాలు ఎన్నో రికార్డులను తిరగ రాశాయి. దీంతో అభిమానుల్లో ఈ కలయికపై భారీ అంచనాలు ఉన్నాయి. 

 ఫిబ్ర‌వ‌రి 26 నుంచి చిత్ర షూటింగ్ వార‌ణాశిలో జ‌ర‌గ‌నుంద‌ని తెలుస్తుంది. చిత్రంలో బాల‌కృష్ణ అఘోరాతో పాటు మ‌రో పాత్ర‌లో క‌నిపించి సంద‌డి చేయ‌నున్నాడ‌ట‌. చిత్రం కాస్త వైవిధ్యంగా ఉంటుంద‌ని తెలుస్తుండ‌గా, ఇందులో ఇద్ద‌రు క‌థానాయిక‌ల‌ని ఎంపిక చేసినట్టు తెలుస్తుంది. ప్ర‌స్తుతానికి శ్రియ‌, న‌య‌న‌తార క‌థానాయిక‌ల‌ని ప్ర‌చారం జ‌రుగుతుండ‌గా, దీనిపై చిత్ర యూనిట్ ఎలాంటి ప్రకటన చేయలేదు.

Leave a Reply

Your email address will not be published.