*లకారం కు అదనపు సొగబులు*

ఖమ్మం ఐకాన్ గా నిలిచిన లకారం ట్యాంక్ బండ్ కు అదనపు సొగుబులు అద్దనున్నట్లు రాష్ట్ర రవాణా శాఖ మంత్రి శ్రీ పువ్వాడ అజయ్ కుమార్ గారు అన్నారు. శుక్రవారం టూరియం ఎండి మనోహర్ రావు గారు, మున్సిపల్ కమీషనర్ అనురాగ్ జయంతి IAS గారు, మేయర్ పాపాలాల్ గారితో కలిసి లకారం ను సందర్శించారు. ట్యాంక్ బండ్ లోపల మినీ బండ్ ను పరిశీలించారు. అక్కడ ఏర్పాటు చేయనున్న పలు వసతులు పై చర్చించారు. ముఖ్యంగా చిన్నపిల్లలకుఅవసరమైయ్యే ఆటలు, జిగ్ జాగ్ సైకిల్, ఇరు వైపులా పచ్చిక(కార్పెట్ గ్రాస్) ముఖ ద్వారం వద్ద డైనోసార్ తదితర ఏర్పాట్లపై వారికి వివరించారు.