బ‌న్నీ త్రివిక్ర‌మ్‌ల కొత్త ట్విస్ట్‌

చాలా గ్యాప్ త‌ర్వాత  అల్లు అర్జున్ మాట‌ల మాంత్రికుడు త్రివిక్ర‌మ్‌తో క‌లిసి సినిమా వ‌స్తోన్న విష‌యం తెలిసిందే. అల‌వైకుంఠ‌పురం పేరుతో వ‌చ్చే ఈ చిత్రం ఫ్యామిలీ అండ్ యాక్ష‌న్ ఎంట‌ర్ టైన‌ర్‌గా తెర‌కెక్కుతోంది. సంక్రాంతి బ‌రిలో ఉండ‌డంతో దీని పై ప్రేక్ష‌కులు భారీ అంచ‌నాల‌తో ఉన్నారు. పైగా గ‌తంలో వీరిద్ద‌రి కాంబో వ‌చ్చిన‘జులాయి’, ‘సన్ ఆఫ్ సత్యమూర్తి’ చిత్రాలు హిట్ అవ్వ‌డంతో ఈ చిత్రం కూడా మంచి విజ‌యం సాధిస్తుంద‌ని చిత్ర యూనిట్ కాన్ఫిడెంట్‌గా ఉన్నారు.


ఇక ఇదిలా ఉంటే… ఇప్పుడు ఈ చిత్రం గురించి మ‌రో కొత్త అప్‌డేట్ హ‌ల్‌చ‌ల్ చేస్తుంది అదేమిటంటే  ‘అల వైకుంఠపురములో’ సినిమాలో అల్లు అర్జున్ ద్విపాత్రాభినయం చేస్తున్నారు. సినిమాలో ఆసక్తికర మైన ఫ్లాష్‌బ్యాక్ ఉంటుందని, ఈ ఎపిసోడ్‌లో అల్లు అర్జున్ రెండు పాత్రల్లో కనిపిస్తారని ఇన్‌సైడ్ టాక్. అంటే, అభిమానులకు డబుల్ అల్లు అర్జున్ డబుల్ ధ‌మాకా అన్న‌మాట‌. అయితే, ఈ ఫన్ ఎంతసేపో ఉండదని కూడా అంటున్నారు. కేవలం 5 నిమిషాలు మాత్రమే అల్లు అర్జున్ డ్యుయల్ రోల్‌లో కనిపిస్తారని తెలిసింది. మొత్తం మీద ప్రేక్షకులకు త్రివిక్రమ్ ట్విస్ట్ ఇవ్వబోతున్నారన్నది హాట్ టాపిక్.


ఈ చిత్రంలో ని హీరోయిన్ పూజాహెగ్డే వీరిద్ద‌రి కాంబినేష‌న్ కూడా ఇది రెండవ‌సారి గ‌తంలో ‘దువ్వాడ జగన్నాథం’ త‌ర‌వాత తిరిగి మ‌ళ్ళీ ఇందులో నటిస్తున్నారు. అలాగే సీనియర్ నటి టబు ఈ చిత్రంలో కీలక పాత్ర పోషిస్తున్నారు. ఇక రాజేంద్రప్రసాద్, సచిన్ ఖేడ్కర్, తనికెళ్ళ భరణి, మురళీ శర్మ, సముద్రఖని, జయరాం, సునీల్, నవదీప్, సుశాంత్, నివేతా పేతురాజ్, గోవిందా పద్మసూర్య, రోహిణి, ఈశ్వరీరావు, కల్యాణి నటరాజన్, శిరీష, బ్రహ్మాజీ, హర్షవర్ధన్, అజయ్, పమ్మిసాయి, రాహుల్ రామకృష్ణ ఇతర పాత్రల్లో నటిస్తున్నారు. ఎస్.ఎస్.తమన్ సంగీతం సమకూరుస్తోన్న ఈ చిత్రాన్ని గీతా ఆర్ట్స్, హారిక అండ్ హాసిని క్రియేషన్స్ కాంబినేషన్‌లో అల్లు అరవింద్, ఎస్.రాధాకృష్ణ (చినబాబు) నిర్మిస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published.