జరిగిన కథను నిజాయితీగా చూపించమన్నారు!- విజయ్ చిల్లా

ఇది దివంగత ముఖ్యమంత్రి వై.యస్.రాజశేఖర్ రెడ్డి జీవితకథ కాదు. రాజకీయాలకు సంబంధం లేని కథాంశం అని అంటున్నారు నిర్మాత విజయ్ చిల్లా. వైయస్ జీవితం లోని పాదయాత్ర ఘట్టాన్ని ౠయాత్రౠ పేరుతో తెరకెక్కిస్తున్నామని అన్నారు. మమ్ముట్టి కథానాయకుడిగా నటించగా, మహి.వి.రాఘవ్ ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. శివ మేక సమర్పణలో70 ఎంఎం ఎంటర్ టైన్ మెంట్స్ పతాకంపై విజయ్ చిల్లా, శశిదేవిరెడ్డి ఈ చిత్రాన్ని నిర్మించారు. ఫిబ్రవరి 8న ఈ చిత్రాన్ని తెలుగు, తమిళం, మలయాళంలో రిలీజ్ చేస్తున్నామని నిర్మాతలు ప్రకటించారు. ఇప్పటికే మమ్ముట్టి డబ్బింగ్ సహా అన్ని కార్యక్రమాలు పూర్తయ్యాయని విజయ్ చిల్లా  హైదరాబాద్ చిట్ చాట్‌లో వెల్లడించారు.
ఒక సీన్ విని ఆశ్చర్యపోయాను:
మహి.వి.రాఘవ్ నేను ఆనందో బ్రహ్మ నిర్మాణానంతర పనుల కోసం చెన్నయ్ వెళ్లేప్పుడు మహి యాత్ర ఆలోచన చెప్పాడు. వైయస్సార్ బయోపిక్ చేయాలనుందని అన్నారు. ఆ టైమ్ లో నేను ఆశ్చర్యపోయాను. మనం కేవలం రెండు సినిమాల కిడ్స్. ఇప్పుడే ప్రయోగాలు ఎందుకు?  కెరీర్ ని రిస్క్ చేస్తామా? అని అన్నాను. వివాదాల్ని నెత్తికెత్తుకోవడం ఎందుకు? అని వారించాను. ఒక సీన్ వినండి.. నిర్ణయించుకోండి అని మహి.వి.రాఘవ్ అభ్యర్థించారు. నేను విన్నాను.. నేను ఉన్నాను అంటూ హాస్పిటల్ సీన్ ని వివరించాడు. ఆ ఒక్క సన్నివేశంతో ఇంప్రెస్ అయ్యాను.. ఆ తర్వాత స్క్రిప్టు రెడీ అయ్యింది. మహి స్క్రిప్టు రాసేప్పుడే మమ్ముట్టి ని దృష్టిలో పెట్టుకుని రాయడంతో ఆ ఐడియా నాక్కూడా నచ్చింది. అటుపై కేరళ వెళ్లి మమ్ముట్టి గారికి స్క్రిప్టు వినిపించాడు. 10 రోజుల్లోనే కథ నచ్చిందని ఆయన ఓకే చెప్పారు. ఇక ఈ చిత్రంలో వైయస్సార్ పాత్రను నిజాయితీగా చూపిస్తున్నాం. అతడి జీవితంలో కీలక దశలో ఘట్టాల్ని చూపించాం. పరిమితంగానే సినిమాటిక్ లిబర్టీ తీసుకున్నాం.

వైయస్ జగన్ అలా అన్నారు:
నేనెప్పుడూ వ్యక్తిగతంగా వైయస్ ఫ్యామిలీని కలవలేదు. కానీ మహి వెళ్లి జగన్ గారిని కలిశాడు. ఉన్నదున్నట్టు చూపించండి.. నాన్నగారు చేయనిది ఏదీ చెప్పొద్దు.. అని ఆయన అన్నారు. అలాగే షూటింగ్ సమయంలోనూ ఆ ఫ్యామిలీ సభ్యులెవరూ అడ్డంకులు చెప్పలేదు. జగన్ గారు ఇంకా సినిమా చూడనేలేదు.

ఆయన ఓ మహదాద్భుతం:
మహి ఈ చిత్రాన్ని అద్భుతంగా తెరకెక్కించాడు. ఆయన కథను ఎలా చెప్పారో అలానే సినిమా తీశారు. ఒక జీవితాన్ని మహదాద్భుతంగా  చూపించగలిగారు. ఇది సాంకేతిక నిపుణులతో పాటు చేసిన కలెక్టివ్ ఎఫర్ట్. మమ్ముట్టి గారి గురించి మాటల్లో వర్ణించలేను. ఆయన పనితనం అమేజింగ్. 350 సినిమాల కథానాయకుడిగా 75 సినిమాల్ని మలయాళంలో పరిచయం చేసిన మేటి హీరోగా ఆయన పనితనం ఎంతో గొప్పది. ఆయన తనకు తానుగానే డబ్బింగ్ చెప్పుకున్నారు. తనకు తానుగానే భాష నేర్చుకున్నారు. బెస్ట్ పెర్ఫామెన్స్ ఇచ్చారు.

Leave a Reply

Your email address will not be published.