ఆహ్లాదకరమైన కామెడీతో క్రేజీ క్రేజీ ఫీలింగ్

విజ్ఞత ఫిలిమ్స్ పతాకంపై నూతలపాటి మధు నిర్మించిన చిత్రం ‘క్రేజీ క్రేజీ ఫీలింగ్’. కేరింత, మనమంతా చిత్రాల హీరో విశ్వంత్ ఈ చిత్రంలో కథానాయకుడు. పల్లక్ లల్వాని కథానాయిక. వెన్నెల కిషోర్ ప్రధాన పాత్రధారి.  సంజయ్ కార్తీక్ దర్శకత్వం వహించారు. ఇటీవలే రిలీజైన ట్రైలర్, పోస్టర్లకు చక్కని స్ప ందన వచ్చింది. నేడు సినిమా థియేటర్లలోకి రిలీజవుతోంది. శ్రీలక్ష్మి డిస్ట్రిబ్యూషన్ సంస్థ ఈ చిత్రాన్ని రిలీజ్ చేస్తోంది.

దర్శక నిర్మాతలు మాట్లాడుతూ టైటిల్ కి తగ్గట్టే క్రేజీగా ఉండే చిత్రమిది. వెన్నెల కిషోర్ కామెడీ ఆద్య ంతం ఆకట్టుకుంటుంది. ఎఫ్ 2 కంటే చక్కని కామెడీ కుదిరింది మా సినిమాలో. మా ట్రైలర్ ని యూట్యూబ్ లో జోరుగా వైరల్ చేస్తున్నారంటే కంటెంట్ ఉందనే అర్థం. ఫిదా చిత్రంలో సిస్టర్ పాత్రలో నటించిన శరణ్య ఈ సినిమాలో నటించింది. నాయకానాయికల నటన హైలైట్ గా ఉంటుంది. కుటుంబ సమేతంగా చూడదగ్గ చిత్రమిది.. అన్నారు. పంపిణీదారుడు బాపిరాజు మాట్లాడుతూ-  2 తర్వాత మెప్పించే చిత్రం మాదే. చక్కని కామెడీ పండింది. 200 పైగా థియేటర్లలో రిలీజ్ చేస్తున్నాం” అన్నారు. సంగీత దర్శకుడు భీమ్స్ మాట్లాడుతూ చక్కగా నటించారు. హిలేరియస్ కామెడీ కుదిరింది. అలా ఎలా తర్వాత చక్కని సంగీతం అందించాను ఈ చిత్రానికి. జర్నలిస్ట్ సురేష్ ఉపాధ్యాయ సాహిత్యం ప్లస్. ఆసక్తి ఉన్న జర్నలిస్టులు పాటలు రాసేందుకు ప్రోత్సహిస్తాను” అన్నారు. కుటుంబమంతా చక్కగా నవ్వుకునే వినోదాత్మక చిత్రమిదని హీరో తెలిపారు.

పోసాని, సుమన్, జయప్రకాష్ రెడ్డి, గుండు సుదర్శన్, కృష్ణంరాజు, చమ్మక్ చంద్ర, ప్రియాంక తదితరులు ముఖ్య పాత్రల్లో నటించారు. ఈ చిత్రానికి సంగీతం: భీమ్స్ సిసిరోలియో, సాహిత్యం: సురేష్ ఉపాధ్యాయ, కాసర్ల శ్యామ్, కెమెరా: సుభాష్ దొంతి, ఎడిటింగ్: శ్రీను.

Leave a Reply

Your email address will not be published.