“వీధుల్లో చీమ విహారం” ” వీధి వీధినా చీమ”, “వీధుల్లో చీమ విడుదల” ! “మా చీమ మీకుగానీ కనిపించిందా? “

చీమ గోడలకెక్కిన సందర్భంగా “చీమ – ప్రేమ మధ్యలో భామ! ” సినిమా దర్శకుడు శ్రీకాంత్ “శ్రీ” అప్పలరాజు మాట్లాడుతూ ” ఈ మా సినిమాను చీమ హీరోగా ‘You can be what you want to be’, అంతఃకరణశుద్ధితో అడుగు ముందుకు వేయగలిగితే ఎవరేమి కావాలనుకున్నా కావచ్చు – అన్న అంతర్లీన సందేశంతో రూపొందించాము. అంతేకాదు, ఈ సినిమా హీరో ప్రభాస్ అభిమానులకు ప్రత్యేకంగా నచ్చుతుంది! ఎందుకో తెలియాలంటే కొంతకాలం ఆగాలి! ” అన్నారు.

ఈ సందర్భంగా సినీ నిర్మాత లక్ష్మీనారాయణ మాట్లాడుతూ ” “చీమ – ప్రేమ మధ్యలో భామ!”   అనే ఒక fantasy తో కూడిన ప్రేమ కథను యూత్ మరియు కుటుంబ సభ్యులు అందరినీ అలరించే విధంగా డైరెక్టర్ గారు తన  New York Film Academy అనుభవంతో ఎంతో అద్భుతంగా తీర్చిదిద్దారు” అని తెలిపారు.

మాగ్నమ్ ఓపస్  (Magnum Opus ) ఫిలిమ్స్ పతాకం పై శ్రీకాంత్ “శ్రీ” అప్పల రాజు దర్శకత్వం లో ఎస్ ఎన్ లక్ష్మీనారాయణ నిర్మిస్తున్న చిత్రం  “చీమ – ప్రేమ మధ్యలో భామ !”. అమిత్ మరియు ఇందు హీరో హీరోయిన్ గా నటించారు

నటీ  నటులు :

అమిత్, ఇందు, సుమన్, హరిత, పురంధర్ , వెంకట్ నిమ్మగడ్డ, రమ్య చౌదరి, బొమ్మ శ్రీధర్, రవి కిషోర్ , కిషోర్ రెడ్డి, వెంకటేశ్ మరియు సురేష్ పెరుగు.

సంగీతం : రవి వర్మ, సింగర్స్ : ఎస్.పి. బాలసుబ్రమణ్యం , గీతా మాధురి, సినిమాటోగ్రఫీ : ఆరిఫ్ లలాని, ఎడిటర్ : హరి శంకర్.

కథ, మాటలు, స్క్రీన్ ప్లే, డైరెక్షన్  : శ్రీకాంత్ “శ్రీ” అప్పల రాజు

నిర్మాత : ఎస్ ఎన్ లక్ష్మీనారాయణ


Leave a Reply

Your email address will not be published.