అసలు వాస్తవం ఏంటి?

పని మనిషిపై లైంగిక వేధింపులు, కిడ్నాప్ అంటూ సీనియర్ నటి భానుప్రియపై ఆరోపణలు వచ్చిన సంగతి తెలిసిందే. ఈ వ్యవహారంలో పోలీసులు పూర్తి స్థాయిలో దర్యాప్తు జరపాలని డిమాండ్ ఊపందుకుంది. ఆ క్రమంలోనే ఈ గొడవలో భానుప్రియకు తిప్పలు తప్పవంటూ పలు టీవీ చానెళ్లు పదే పదే కథనాల్ని వండి వార్చడం భానుప్రియ అభిమానుల్లో చర్చకొచ్చింది. ఈ వివాదంలో ఇప్పటికే పని పిల్ల మీడియా ముందుకు వచ్చి తనపై ఎలాంటి అఘాయిత్య ం జరగలేదని వాంగ్మూలం ఇచ్చినా టీవీ చానెళ్లు విడిచిపెట్టకుండా తనపై ఇష్టం వచ్చినట్టు కథనాలు వండి వార్చడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అసలు ఈ కేసును పరిశోధించాల్సిన వాళ్లు పరిశోధించడం లేదా? ఇందులో నీరుగార్చడానికి ఎవరైనా ప్రయత్నిస్తున్నారా? అంతా మీడియా ముఖంగానే కనిపిస్తున్నప్పుడు భానుప్రియను ముందే దోషిని చేసేసింది మీడియా అంటూ పలువురు అభిమానులు సామాజిక మాధ్యమాల్లో వాపోతున్నారు. ఆంధ్రప్రదేశ్, తూర్పుగోదావరి జిల్లా, సామర్లకోట ప్రాంతానికి చెందిన 14 ఏళ్ల బాలిక ఇప్పటికే భానుప్రియకు మీడియా ముఖంగా క్లీన్ చిట్ ఇస్తే, ఆ బాలిక తల్లి సహా బాలల సంరక్షణ హక్కుల సంఘాలు అల్లరి చేయడంపైనా ప్రస్తుతం నెటిజనుల్లో వాడి వేడిగా చర్చ సాగుతోంది. ఇలాంటి వివాదాల్లో నిజం ఏది? అన్నది రక్షకభటులు నిర్ధారించాల్సి ఉంటుంది. ఇక ఈ కేసులో సదరు పనమ్మాయి దొంగతనం అలవాటుపై భానుప్రియ ప్రత్యారోపణలు చేశారు. తనని కిడ్నాప్ చేయలేదని .. అలాగే తనని ఇబ్బ ంది పెట్టే ఉద్ధేశం లేదని భానుప్రియ అన్నారు. ఈ కేసులో అసలు వాస్తవాలేంటో తేలాల్సి ఉందింకా. ఇక చిన్న వయసు లో ఉన్న తనని కార్మికురాలిని చేసినందుకు భానుప్రియకు శిక్ష తప్పదన్న వాదనా వినిపిస్తోంది.