ఫేస్ బుక్ లో ‘వైఎస్ఆర్ సిపి ఫోరం’ పోల్

ప్రతి విషయానికి పోల్స్ నిర్వహించి జనాభిప్రాయం తీసుకోవటం ఈ మధ్య సామాజిక మీడియాలో కనిపిస్తూ వస్తోంది. గత కొంత కాలంగా అమరావతి రాజధాని ప్రాంత రైతులు చేస్తున్న ఆందోళన, రాజధాని తరలింపు, మూడు రాజధానులు ఇలా అనేక అంశాలపై పోలింగ్ జరుగుతునే ఉంది.
తాజాగా ఫేస్ బుక్ లో వైఎస్ఆర్ సిపి ఫోరం కూడా ఇదే తరహాలో ఓ పోల్ నిర్వహించింది. నిత్యం ఆ ఫేస్ బుక్ వాల్ నింపుగా ఏపి సిఎం వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి పథకాలు, ఆయని పొగుడుకుంటూ చేసే పోస్టులు ఉంటే ఆశ్చర్యపోనవసరం లేదు. సిఎం జగన్ తీసుకున్న మూడు రాజధానుల అంశంపై తెగ ప్రచారం చేసింది కూడా.
అయితే ఈ ఫేస్ బుక్ పేజి ఈ మధ్య తన వాల్‌పై ఒక పోల్ నిర్వహించింది. అంతేనా పార్టీలకు అతీతంగా మీ అభిప్రాయాలను వెల్లడించండంటూ ఆహ్వానించింది. అదీ మన రాజధాని అమరావతి అయితే బాగుంటుందా…విశాఖపట్నం అయితే బాగుంటుందా… అని ఆప్షన్ ఇచ్చి మరీ అందరూ పాల్గొనాలని ఆహ్వానించింది.
ఈ ఓటింగ్‌కి బాగానే స్పందన వచ్చింది. ఈ పోలింగ్ లో ఏకంగా 11 లక్షల 38 వేల మంది ఓట్లు వేశారు. 11 వందల కామెంట్లు 2900 షేర్లు వచ్చాయి. అంతా సజావుగా ఉంది కదా? అని అనుకునేరు…. అక్కడే ఈ నిర్వాహకులకు తల బొప్పికట్టేలా పోలింగ్ ఫలితం ఉండటం విశేషం. ఈ పోల్ లో పాల్గొన్న వారిలో 77 శాతం మంది అమరావతిలో రాజధాని ఉండాలని తేల్చి చెప్పగా విశాఖ పట్నంలో రాజధాని ఉండాలని కేవలం 23 శాతం మంది మాత్రమే ఓటు వేయటం విశేషం.
ఇప్పుడు ఈ వాల్ స్క్రీన్ షాట్లు సామాజిక మీడియాలో తుగ ట్రోలింగ్ అవుతున్నాయి. సొంత పరివారం నిర్వహించుకునే సామాజిక మీడియా ఎకౌంట్లో జనం స్పందన చూసి, అవాక్కవుతున్నారట వైసిపి వర్గాలు. అదండీ మేటరు…